1.4 కోట్ల కీలక డేటా లీక్.. ఏఐ కంపెనీ నిర్లక్ష్యంతో బయటపడిన రహస్యాలు!
Published on: Thu Oct 15, 2026 10:37AM
.webp)
సైబర్ ప్రపంచాన్ని మరోసారి వణికిస్తున్న ఒక భారీ డేటా లీక్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఏఐ డెవలప్మెంట్ సంస్థ వైబ్టెక్ (Vibetech) చేసిన తీవ్రమైన పొరపాటు కారణంగా దాదాపు 1.4 కోట్ల (13.7 మిలియన్లు) రికార్డులు ఆన్లైన్లో ఎవరికీ పడితే వారికి అందుబాటులోకి వచ్చాయి. వివిధ డేటా ఉల్లంఘనలు మరియు గతంలో జరిగిన సైబర్ దాడిల నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ సంస్థ ఒకే చోట భద్రపరుస్తున్న క్రమంలో, సరైన రక్షణ లేకపోవడంతో ఈ దారుణం జరిగింది. ఎలాంటి పాస్వర్డ్ లేదా ఎన్క్రిప్షన్ రక్షణ లేకుండా ఈ డేటాబేస్ నేరుగా ఇంటర్నెట్లో తెరుచుకుని ఉండటం సైబర్ భద్రతా నిపుణులను నివ్వెరపోయేలా చేసింది.
ప్రముఖ సెక్యూరిటీ పరిశోధకుడు జెరెమి ఫౌలర్ (Jeremiah Fowler) ఈ భారీ భద్రతా లోపాన్ని గుర్తించి ప్రపంచానికి వెల్లడించారు. ఈ భారీ ఆర్కైవ్‌లో పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, రహస్య పాస్వర్డ్లు మరియు బ్యాంక్ ఖాతా వివరాల వంటి అత్యంత సున్నితమైన సమాచారం సులభంగా బయటపడింది. ఏటీ అండ్ టీ (AT&T) డేటా లీక్‌కు సంబంధించిన సుమారు 8 మిలియన్ల రికార్డులు ఇందులో సింహభాగం ఉన్నాయి. అంతేకాకుండా, అమెజాన్ సంస్థకు చెందిన 1.2 మిలియన్లు, వాల్‌మార్ట్ (Walmart) సంస్థకు చెందిన 4,20,000 రికార్డులు, బ్లూబ్యాంక్ డిజిటల్ బ్యాంక్‌కు చెందిన 24,000 అలాగే పేపాల్ (PayPal) వినియోగదారులకు సంబంధించిన 18,000 రికార్డులు ఈ లీకైన జాబితాలో ఉండటం గమనాహారం.
(9).webp)
ఇంతటితో ఆగకుండా, అత్యంత భద్రత ఉండాల్సిన ప్రభుత్వ మరియు అంతర్జాతీయ సంస్థల వివరాలు కూడా ఇందులో బయటపడటం మరింత కలకలం రేపింది. ఎఫ్‌బీఐ (FBI) ఉద్యోగుల డైరెక్టరీకి చెందిన 4,084 రికార్డులు మరియు ఇంటర్‌పోల్ (Interpol) సంస్థకు చెందిన 929 రికార్డులు కూడా ఈ ఓపెన్ డేటాబేస్‌లో లభించాయి. గతంలో వివిధ వేదికల నుంచి లీకైన ఈ అత్యంత విలువైన సమాచారాన్ని వైబ్టెక్ సంస్థ రీసెర్చ్ మరియు త్రెట్ ఇంటెలిజెన్స్ కోసం సేకరించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిని క్లౌడ్ సర్వర్లలో సురక్షితంగా ఉంచడంలో విఫలమవడం వల్ల హ్యాకర్లకు ఇది సులభంగా చిక్కే ప్రమాదం ఏర్పడింది.
ఈ భారీ డాటా లీక్ కేవలం గోప్యతా సమస్య మాత్రమే కాదని, సాధారణ వినియోగదారుల ఆర్థిక భద్రతను పూర్తిగా ప్రమాదంలోకి నెట్టే తీవ్ర పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దొరికిన పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాల ద్వారా సైబర్ నేరగాళ్లు నేరుగా యూజర్ల ఆన్లైన్ ఖాతాలను హ్యాక్ చేసే అవకాశం ఉంది. రన్సమ్వేర్ దాడులకు పాల్పడటంతో పాటు నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బును కాజేసే ముప్పు కూడా పొంచి ఉంది. పరిశోధకుడు సమాచారం అందించిన వెంటనే సంబంధిత కంపెనీ మరియు హోస్టింగ్ ప్రొవైడర్ స్పందించి ఆ డేటాబేస్‌ను లాక్ చేయడంతో తక్షణ ముప్పు తప్పింది.
[Vibetech Data Leak, 13.7 Million Records Exposed, Jeremiah Fowler, Cybersecurity, AT&T Data Breach, Amazon Data Leak, Walmart Data Breach, PayPal Data Leak, FBI Employee Records, Interpol Data Leak]


