"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" స్పెషల్ షో చూసిన మహేష్, వెంకటేష్
Published on: Thu Jan 10, 2013 2:34PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. నిన్న సిటి లో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" స్పెషల్ ప్రిమియర్ షో వేశారు. ఈ ప్రిమియర్ కి వెంకటేష్, మహేష్ ఫ్యామిలితో కలిసి హాజరయ్యారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఫ్యామిలితో స్పెషల్ షో చూశారు.
ఈ చిత్రం గురించి ఆయన మరిన్ని వివరాలు వెల్లడిస్తూ...దాదాపు 25 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ మల్టీ స్టారర్ ఈ సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా జనవరి 11న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాము. తప్పకుండా అందరి ఎక్స్ పెక్టేషన్స్ ని ఈ సినిమా రీచ్ అవుతుంది. మా బేనర్ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్ ప్రెస్టేజ్ మరింత పెంచుతుంది. ఈ మల్టీ స్టారర్ ఇంత బాగా రావడానికి దోహద పడిన వెంకటేష్, మహేష్ బాబులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.


