TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన చంద్రబాబు.!

Published on: Mon Aug 31, 2026 12:07PM

ఆంధ్రప్రదేశ్ జలవనరుల చరిత్రలో  మైలురాయిగా నిలిచే  పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం (ఆగస్టు 31) ప్రారంభించి జాతికి అంకితం చేశారు.  ఈ సందర్భంగా కృష్ణా నదీమతల్లికి  చీర సారె సమర్పించి జలహారతి ఇచ్చారు.  అనంతరం..  ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాజెక్ట్ పైలాన్‌ను  ఆవిష్కరించారు.

  వెలిగొండ ఫీడర్ కాలువ వద్ద ఏర్పాటు చేసిన క్రాస్ రెగ్యులేటర్ ప్రాంతానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి కొల్లంవాగు ద్వారా తరలించిన కృష్ణా జలాలకు జలహారతి సమర్పించారు.ఈ ప్రాజెక్టు ప్రారంభంతో ప్రకాశం, రాయలసీమ ప్రజల దశాబ్దాల కల సాకారం అయ్యింది. 

అనంతరం క్రాస్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి,  నీటిని  నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు,   కడప జిల్లాల్లోని కర వు పీడిత భూములు సస్యశ్యామలం కానున్నాయి.  వెలిగొండ జలసిరులు..  అభివృద్ధి రెక్కలు" అనే నినాదంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును   ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసింది.ఈ  ప్రాజెక్ట్ ద్వారా   నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడమే కాకుండా, దాదాపు ఇరవై మూడు లక్షల మందికి  సురక్షిత  తాగునీరు అందుతుంది.    

Veligonda Project, CM Chandrababu Naidu, Nallamala Sagar Reservoir, AP Irrigation News, Pula Subbaiah Veligonda, Telugu One