TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహా విషాదం: వరకట్న వేధింపులు.. పుణెలో టెక్కీ బలవన్మరణం.!

Published on: Wed Sep 30, 2026 12:13PM

వరకట్నం కోసం అత్తింటి వారి వేధింపులు తాళలేక నవవధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పుణెలో చోటు చేసుకుంది. వివాహం అయిన  నెలల వ్యవధిలోనే  ఓటెక్కీ బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెడితే.. పుణె కు చెందిన వైష్ణవి ఓంకార్ అనే 24 ఏళ్ల యువతి పుణెలోసాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నది.  ఆమె వివాహం మే 9వ తేదీన ఓంకార్ సంజయ్ గిస్రే అనే యువకుడితో  వైభవంగా జరిగింది.  పెళ్లి  సమయంలో అమ్మాయి తరఫు తల్లిదండ్రులు భారీగా ఖర్చు పెట్టారు. వివాహ వేడుక నిమిత్తం సుమారు రూ. 45 లక్షల నగదుతో పాటు, పది తులాల బంగారు ఆభరణాలను కట్నంగా సమర్పించారు.  

పెళ్లైన  కొద్ది రోజులకే వైష్ణవి కాపురంలో ఇబ్బందులు మొదలయ్యాయి. అదనపు కట్నం తెనాలంటూ  భర్త,  అత్తమామల వేధింపులు మొదలయ్యాయి.  కారు కొనడం కోసంపుట్టింటి నుంచి ఐదు లక్షల రూపాయలు అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తింటి వారు వేధించడం మొదలు పెట్టారు. అయితే అందుకు ఇష్టపడని వైష్ణవి, వారి వేధింపులను మౌనంగా భరించింది. అయితే వేధింపులు రోజురోజుకూ తీవ్ర మౌతుండటంతో ఇక భరించ లేక వైష్ణవి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.  

ఈ ఘటనపై మృతురాలి తండ్రి ప్రవీణ్ రఘునాథ్ జరాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మృతికి అల్లుడు ఓంకార్‌తో పాటు, మామ సంజయ్ మహాదేవ్ గిస్రే, అత్త రూపాలి సంజయ్ గిస్రేల వేధింపులే కారణమని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కూతురు మరణానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన  కోరారు.

ఆ ఫిర్యాదు  స్వీకరించిన క పోలీసులు  భర్త ఓంకార్‌తో పాటు అత్తమామలపై సంబంధిత  కేసులు నమోదు చేశారు. వరకట్న నిషేధ చట్టంతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం కింద అభియోగాలు మోపినట్లు అధికారులు వెల్లడించారు. 

[Vaishnavi Gisre Suicide, Pune, Software Engineer Dowry Death, Dowry Harassment, Telugu One]