TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎందుకా పరుగులు.. దెబ్బలు తగులుతాయి.. పపరాజీలకు వైభవ్ సూర్యవంశీ స్వీట్ అండ్ క్యూట్ వార్నింగ్.!

Published on: Fri Oct 16, 2026 12:13PM

 క్రికెట్ సంచలనం 15 ఏళ్ల  బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పాపరాజీలకు వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది.  ఆసియా క్రీడలలో అద్భుత ప్రదర్శన కనబరిచి స్వర్ణ పతకాలు సాధించిన క్రీడాకారుల అభినందన సభలో పాల్గొనేందుకు వైభవ్ సూర్యవంశీ గురువారం (అక్టోబర్  15) ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. ఢిల్లీలో అకాల వర్షం కురుస్తున్న సమయంలో ఎయిర్‌పోర్ట్ వెలుపల వైభవ్ సూర్యవంశీ వీడియోలు, ఫోటోలు తీసేందుకు పాపరాజీలు ఎగబడ్డారు.

కెమెరాలతో తన వెనుక పరుగులు తీస్తున్న వారిని చూసి వైభవ్ సూర్యవంశీ  స్పందించారు.  రీల్స్ కోసం అలా వెంట పడకండి బ్రో.. అనవసరంగా దెబ్బలు తగులుతాయి అంూ  సామాజిక మాధ్యమం వేదికగా హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు  నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ కామెంట్లకు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. వైభవ్ సూర్యవంశీ   నవ్వులు, ఆయన మాట్లాడిన తీరును తెగ పొగిడేస్తున్నారు. 

మరోవైపు, వెస్టిండీస్‌తో అక్టోబర్ 17, 2026 శనివారం రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న నిర్ణయాత్మక ఆఖరి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఆడే అవకాశాలు దాదాపు మృగ్యమే. టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరం ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న సంజు శాంసన్, అభిషేక్ శర్మ  రాణిస్తుండటంతో టీమిండియా మేనేజ్‌మెంట్ వారిపైనే నమ్మకం ఉంచింది.

దీంతో స్వదేశీ గడ్డపై ఇంకా భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయని సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో కూడా బెంచ్‌కే పరిమితం  అయ్యే అవకాశాలే మెండు.  వైభవ్ సూర్యవంశీ అవకాశాల కోసం మరి కొంత కాలం వేచి చూడక తప్పదని ఇప్పటికే  హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్  విస్పష్టంగా చెప్పారు. 

[Vaibhav Sooryavanshi Sweet warning paparazzi, Team India, Viral Video, T20 Series, Windies, Telugu One]