వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. 3 నంబర్ వెనుక అసలు సీక్రెట్ ఇదే!
Published on: Tue Aug 25, 2026 10:38AM
.webp)
భారత దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పిన్న వయస్కుడైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈస్ట్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ఈ 15 ఏళ్ల కుర్రాడు మైదానంలోకి అడుగుపెట్టగానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈసారి అతడు తన బ్యాటింగ్ విధ్వంసంతో కాకుండా, ధరించిన జెర్సీపై ఉన్న ప్రత్యేకాంశంతో నెటిజన్ల కంటికి చిక్కాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈస్ట్ జోన్ వర్సెస్ నార్త్ ఈస్ట్ జోన్ క్వార్టర్ ఫైనల్ పోరులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టుకు వైభవ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. అయితే బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ జెర్సీపై ఉన్న ఒక వింత గుర్తు అందరినీ ఆశ్చర్యపరిచింది.
అతడు మైదానంలో క్రీజులోకి అడుగుపెట్టినప్పుడు అతడి జెర్సీ పైభాగంలో ఉన్న నంబర్‌ను నల్లటి టేప్‌తో కవర్ చేసి ఉంచారు. ఆ టేప్ వేసిన తీరును నిశితంగా పరిశీలిస్తే, జెర్సీపై కేవలం '3' అనే నంబర్ మాత్రమే స్పష్టంగా కనబడేలా జాగ్రత్త పడినట్లు కనిపించింది. దీంతో అసలు జెర్సీపై టేప్ వేయడానికి కారణం ఏంటి అనే దానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్రమైన చర్చ మొదలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీ తరఫున ఆడే వైభవ్ సాధారణంగా '3' నంబర్ ఉన్న జెర్సీతోనే మైదానంలోకి దిగుతాడు. దులీప్ ట్రోఫీ మ్యాచ్ కోసం అధికారులు కేటాయించిన జెర్సీపై నంబర్ ప్రింటింగ్‌లో ఏమైనా తప్పు జరిగిందా లేదా వైభవ్ తన అదృష్ట సంఖ్యగా భావించే '3' మాత్రమే బయటకు కనిపించాలనే ఉద్దేశంతోనే మిగిలిన భాగాన్ని టేప్‌తో డాప్చారా అనేది ఆసక్తికరంగా మారింది.
vaibhav sooryavanshi jersey number 3 duleep trophy,duleep trophy vaibhav sooryavanshi debut details


