సీమాంధ్రులలో హైదరాబాద్ యు.టి. ఆశలు

 

 

 

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రులను దారుణంగా మోసం చేసింది. తరతరాలు కోలుకోలేని విధంగా అన్యాయం చేసింది. కనీసం హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించకుండా హైదరాబాద్ మొత్తం మీద తెలంగాణకే అన్ని హక్కులూ ధారాదత్తం చేస్తూ సీమాంధ్రులను హైదరాబాద్‌లో అనాథలుగా చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు విభజనకు ప్రతీకారం తీర్చుకోవడానికి, తెలుగుదేశం, బీజేపీ కూటమికి పట్టం కట్టడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా వున్నారు.

 

రేపటితో తెలంగాణలో ఎన్నికలు ముగుస్తున్నాయి. ఎన్నికల కోసమే ఇప్పటి వరకూ కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అనే అంశాలన్ని ఇప్పటి వరకూ బయటకి చెప్పని బీజేపీ నాయకత్వం తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది. మే 1న సీమాంధ్రలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొనే సభలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనే అంశాన్ని మోడీ ప్రకటించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.



ఈ అనుమానాన్నే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌కీ వచ్చింది. తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే హైదరాబాద్ యూటీ చేస్తామనే ప్రకటన బీజేపీ నుంచి వస్తుందని ఆయన ఓ బహిరంగ సభలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో దారుణంగా గాయపడిన సీమాంధ్రకు ఆ గాయాలు తగ్గాలంటే హైదరాబాద్ యుటి ప్రకటన చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద వుంది.