నాన్ననే పెళ్ళాడతా

 

‘నిన్నే పెళ్ళాడతా’ అనే మాటకి బదులు ‘నాన్ననే పెళ్ళాడతా’ అని రాశామని అపార్థం చేసుకోవద్దు... ఈ మాట కరెక్టే.. ఆస్ట్రేలియా దేశంలోని మెల్‌బోర్న్ నగరంలో ఒక టీనేజ్ అమ్మాయి తన తండ్రిని పెళ్ళాడాలని డిసైడైంది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్నప్పటికీ ఈమె అమెరికా దేశానికి చెందిన యువతి. ఆమె తల్లి నుంచి తండ్రి విడిపోయాడు. ఈ యువతి తండ్రితోనే వుంటోంది. కొన్ని విషయాలు చెప్పాలంటే చాలా ఇబ్బందిగా కూడా వుంటుంది. కానీ చెప్పక తప్పని పరిస్థితి. ఆ తండ్రి ద్వారా ఆమె ఇప్పుడు గర్భందాల్చింది. త్వరలో తన తండ్రిని పెళ్ళి చేసుకోవడానికి ఆమె సన్నాహాలు చేసుకుంటోంది. తన తండ్రి తనకు చాలా నచ్చేశాడని అంటోంది. ఒకరోజు తన తండ్రిని తాను చూస్తున్నప్పుడు ఆయన చాలా అందగాడని తనకు అర్థమైందని, వెంటనే ఆయనతో తన రిలేషన్‌షిప్‌ని పూర్తిగా మార్చేశానని చెబుతోంది. ఈ తండ్రీకూతుళ్ళ వ్యవహారం తెలిసినవాళ్ళు ఇదేంట్రా దేవుడా అని అదిరిపోతున్నారు. వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని తెలిసిన వాళ్ళు వీళ్ళతో మాట్లాడ్డానికే జంకుతున్నారు. అయితే తండ్రీ కూతుళ్ళు పెళ్ళి చేసుకోవడానికి ఆస్ట్రేలియా చట్టాలు ఒప్పుకోవు. అందువల్ల ఈ తండ్రీకూతుళ్ళు అమెరికాలోని న్యూజెర్సీ వెళ్ళిపోబోతున్నారు. న్యూజెర్సీలోని చట్టాలు తమలా పెళ్ళి చేసుకునేవాళ్ళకి అనుకూలంగా వుంటాయట.