TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా నావికాదళ సిబ్బంది ఆత్మహత్యా యత్నాలు నిజమే: కుండబద్దలు కొట్టిన నౌకాదళ కార్యదర్శి.!

Published on: Fri Sep 25, 2026 9:30AM

అమెరికా నౌకాదళానికి చెందిన   శక్తిమంతమైన యుద్ధనౌకలో  సుదీర్ఘ కాలం పాటు  ఉంటూ ఉద్రిక్త ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన  యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్' క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో పనిచేస్తున్న పలువురు సిబ్బంది తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ దళానికి చెందిన   ఎనిమిది మంది నావికులు వివిధ సందర్భాల్లో ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నించినట్లు అమెరికా నావికాదళం  ధృవీకరించింది. అమెరికా రక్షణ రంగ వర్గాల్లో ,  పొలిటికల్ సర్కిళ్లలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 

 కార్యియర్ స్ట్రైక్ గ్రూప్ లో పని చేస్తున్న సిబ్బంది  ఆత్మహత్యాయత్నాలను   నౌకాదళ కార్యదర్శి హంగ్ కావో స్వయంగా వెల్లడించారు. సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ సభ్యురాలైన సెనేటర్ కిర్స్టన్ గిలిబ్రాండ్ గతంలో లేవనెత్తిన ప్రశ్నలకు రక్షణ శాఖ తరఫున ఆయన లిఖితపూర్వక సమాధానం అందజేశారు.

ఈ సుదీర్ఘ కాల మోహరింపు సమయంలో నౌకలో ఎటువంటి మరణాలు సంభవించలేదని.. అయితే నౌకాదళంలో   ఎనిమిది ఆత్మహత్యాయత్నాలు నమోదయ్యాయని ఆయన వివరించారు.  ఈ సంఖ్య కేవలం ప్రధాన నౌకలోని సిబ్బందికే పరిమితం కాలేదనీ, ఎయిర్ వింగ్, డిస్ట్రాయర్ స్క్వాడ్రన్ సిబ్బంది, ఇతర అనుబంధ నౌకల్లోని సిబ్బందిని కూడా కలుపుకుని లెక్కించినట్లు పేర్కొన్నారు.

ఈ యుద్ధనౌకల సమూహం గత నవంబర్‌లో కాలిఫోర్నియాలోని తన హోమ్ పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యప్రాచ్య ప్రాంతానికి చేరుకుంది. అక్కడ అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఈ నౌక సుదీర్ఘ కాలం పాటు సముద్రంలోనే ఉండిపోయింది.

ఎలాంటి విరామం లేకుండా ఏకంగా 286 రోజులకు పైగా సముద్రంలోనే గడపడం ఈ నౌక చరిత్రలోనే రికార్డుగా చెబుతున్నారు. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణం, నిరంతర ఆపరేషనల్ ఒత్తిళ్ల కారణంగా ఈ దళాన్ని వెనక్కి రప్పించడంలో జాప్యం జరిగింది.  సుదీర్ఘ కాలం పాటు కుటుంబాలకు దూరంగా ఉండటం, నిరంతరం ప్రమాదకర వాతావరణంలో విధులు నిర్వహించడం నావికుల మానసిక స్థైర్యం, ఆరోగ్యంపై  ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు.   

[US Navy Personnel,  US Navy, suicide attempts, military mental health, Facts, Revealed, Telugu One]