TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికా యుద్ధ రహస్యాలు లీక్.. ఉన్నత స్థాయి సైనికాధికారులకు లై డిటెక్టర్ టెస్టులు.!

Published on: Sat Sep 5, 2026 10:39AM

అమెరికా రక్షణ శాఖలో కీలకమైన వ్యూహాత్మక సమాచారం లీక్ కావడం కలకలం రేపింది.  దేశ భద్రతకు సంబంధించిన   గోప్యమైన విషయాలు,  ముఖ్యంగా అధునాతన ఆయుధాలు,  క్షిపణుల నిల్వలకు సంబంధించిన వివరాలు లీక్ కావడం పట్ల అగ్రరాజ్యాధినేత   డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు అమెరికా సైన్యంలో కొందరు ఉన్నతస్థాయి అధికారులు సహా, దాదాపు 50 మందికి    లైడిటెక్టర్,  పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. 

ఇరాన్‌తో  యుద్ధం నేపథ్యంలో  అమెరికా తన అత్యాధునిక ఆయుధ సంపత్తిని ఏ వేగంతో వినియోగిస్తుందనే అంశాలపై  మీడియాలో పుంఖానుపుంఖాలుగా  కథనాలు వెలవడిన సంగతి విదితమే. అమెరికా ఆయుధాల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయంటూ వెలువడిన ఆ కథనాలతో అసలీ సమాచారం ఎలా బయటకు పొక్కిందన్న విషయంపై పెంటగాన్ ఆరా తీస్తున్నది. అత్యంత రహస్య సమాచారం బయటకు పొక్కడాన్ని సీరియస్ గా తీసుకుని.. ఎవరి ద్వారా ఈ ఇన్ ఫర్మేషన్ లీకైందన్న విషయాన్ని  తులుసుకునేందుకు  ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను అమెరికా ఏర్పాటు చేసింది. 

సమాచారం ఎలా బయటకు చేరిందన్న విషయంపై దర్యాప్తులో  భాగంగా  పెంటగాన్,  సెంట్రల్ కమాండ్‌కు చెందిన పలువురు సీనియర్ అధికారులకు పాలీగ్రాఫ్, లై డిటెక్టర్ టెస్టులు చేశారు.  ప్రత్యేక యాక్సెస్ ప్రోగ్రామ్‌లు, మిలిటరీ రహస్య పత్రాలను వీక్షించే అధికారాలు ఉన్న ఉన్నతాధికారులకు ఈ పరీక్షలు నిర్వహించారు.  దేశ భద్రతకు భంగం కలిగించే అంశాలను  అనధికారికంగా బయటపెట్టిన వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహించారు. 

 

అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్‌సెత్ నేతృత్వంలో ఈ లీకులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. నిఘా సమాచారాన్ని, ప్రభుత్వ రహస్యాలను బయటపెట్టేవారిని గుర్తించి వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.   ఈ పరీక్షలకు సంబంధించి పెంటగాన్ అధికార ప్రతినిధి సీన్ పార్నెల్ ..  అంతర్గత సిబ్బంది వ్యవహారాలు లేదా కొనసాగుతున్న విచారణల గురించి వివరాలు వెల్లడించలేమని, అయితే..  కానీ, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లేలా రహస్యాలు లీక్ చేసినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని చెప్పారు. 

[US Military secrets leaked, Pentagon leaks, Polygraph tests, Defense Secretary Pete Hegseth, National Security secrets]