TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ రెంటినీ కలిపి చూడద్దు: పీఈఆర్ఎం సస్పెన్షన్ పై నాస్కామ్ వివరణ.!

Published on: Fri Oct 9, 2026 11:05AM

అమెరికా టెక్ రంగంపై తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమినీ వంటి దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలపై  పీఈఆర్ఎమ్  కింద గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేసింది. విదేశీ ఉద్యోగుల కోసం గ్రీన్ కార్డ్ కోరుతూ దరఖాస్తు చేసే పీఈఆర్ఎమ్ నుంచి ప్రముఖ ఐటీ సంస్థలను సస్పెండ్ చేస్తున్నట్లు అమెరికా లేబర్ సెక్రటరీ కీత్ సోండర్‌లింగ్   ప్రకటించారు. ఈ సంస్థలపై పలు ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

అమెరికన్ కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2009 సంవత్సరం నుంచి కేవలం ఈ ఎనిమిది కంపెనీలు మాత్రమే దాదాపు 3 మిలియన్ల మంది విదేశీ కార్మికులను కోరాయని, ఇప్పటివరకు 230,000లకు పైగా హెచ్-1బి వీసా అనుమతులు లక్షకు పైగా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్లను పొందాయని అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్  గణాంకాలు విడుదల చేసింది. 

అది పక్కన పెడితే దిగ్గజ ఐటీ కంపెనీలను పీఈఆర్ఎమ్ నుంచి సస్పెండ్ చేస్తూ ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇండియా ఐటీ పరిశ్రమల సమాఖ్య  నాస్కామ్ స్పందించింది. ఇమ్మిగ్రేషన్, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులైన నిపుణుల మొబిలిటీ  రెండింటినీ కలిపి చూడవద్దని పేర్కొంది. ఇవి రెండూ రెండు వేర్వేరు అంశాలన్న నాస్కామ్..  వాటిని ఒకే కోణంలో చూడడం సరికాదన్నది.

ఈ తాజా పరిణామం అమెరికాలో పనిచేస్తున్న ఇండియన్ టెక్కీలు,  ఐటీ కంపెనీల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది టెక్కీలకు ఇది ఆశనిపాతంగా పరిణమించింది.  గత కొన్నేళ్లుగా ఇండియన్  ఐటీ కంపెనీలు అమెరికాలో స్థానిక నియామకాలను భారీగా పెంచాయని, హెచ్-1బి వీసాలపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకున్నాయని నాస్కామ్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. అయినా సరే, అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇరు దేశాల టెక్ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 


[US Green Card suspension, Nasscom reaction, Infosys Wipro US, PERM program update, H-1B visa news, US IT firms suspended]