వలసదారుల విషయంలో తప్పు చేశాము..ఓటమిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.!
Published on: Mon Nov 9, 2026 2:13PM
.webp)
అమెరికాలో ఇటీవలి కాలంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న అక్రమ వలసదారుల బహిష్కరణ విధానంపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అవలంబించిన కఠినమైన చట్టాలు, వలస విధానాలు సాధారణ ప్రజలకు కాస్త కఠినంగా, మితిమీరినట్లు అనిపించి ఉండవచ్చని ఆయన అంగీకరించారు.
ఇటీవల జరిగిన మిడ్ టర్మ్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్, సెనేట్ స్థానాలను కోల్పోయి పూర్తి ఆధిక్యతను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి వలసదారుల బహిష్కరణ విధానం కూడా ఒక కారణమై ఉండొచ్చని ట్రంప్ పరోక్షంగా అంగీకరించారు. సరిహద్దుల భద్రత విషయంలో తాము తీసుకున్న చర్యలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినా, దేశంలో ఏళ్ల తరబడి ఉంటున్న కొందరి విషయంలో అనుసరించిన వైఖరి మాత్రం ప్రతికూల ప్రభావం చూపి ఉంటుందని ఆయన విశ్లేషించారు.
అయితే, దేశంలో తీవ్ర నేరాలకు పాల్పడే డ్రగ్ డీలర్లు, హంతకులను మాత్రం ఏమాత్రం ఉపేక్షించేది లేదని, వారిని వెనక్కి పంపడం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అదే సమయంలో హోటళ్లు, ల్యాండ్‌స్కేపింగ్ రంగాల్లో సక్రమంగా పనిచేస్తూ, పన్నులు చెల్లిస్తున్న మంచివారైన కొందరి వలసదారుల విషయంలో చట్టసవరణలు చేసేందుకు, డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సెనేట్ డెమోక్రాటిక్ లీడర్ చక్ షుమెర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. వలసదారుల అణచివేత విధానం విఫలమైందని స్వయంగా అంగీకరించిన ట్రంప్, అదే విధానానికి కారకుడైన వ్యక్తికి మరింత ఉన్నతమైన వైట్ హౌస్ బాధ్యతలు అప్పగించడం సరికాదని ఎద్దేవా చేశారు.
అమెరికా రాజకీయాల్లో వలసదారుల అంశం ఎప్పుడూ అత్యంత సున్నితమైనదే కాకుండా, ఎన్నికల ఫలితాలను తల్లకిందులు చేసే ప్రధాన అస్త్రంగా మారుతూ వస్తోంది. దేశ అధ్యక్షుడే స్వయంగా తన విధానాలపై పునరాలోచనలో పడటం, ప్రత్యర్థి పార్టీలతో సమన్వయం చేసుకుంటామని అనడం అమెరికా రాజకీయ సమీకరణాలలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది.

రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో కొత్త మెజారిటీ పార్టీతో ఇమిగ్రేషన్ చట్టాలపై ఎలాంటి ఒప్పందాలు కుదురుతాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రజల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ యంత్రాంగం తన విధానాలను ఎంతవరకు సవరిస్తుందనేది రానున్న కాలంలో తేలనుంది.
ఇది కూడా చదవండి: భాగ్యలక్ష్మి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. పవిత్ర నాణేల కోసం బారులు తీరిన జనం.!
[ US Deportation Policy Donald Trump, US Midterm Elections, Undocumented Immigrants, Democrats and Republicans, US Immigration News, Telugu One, Telugu News ]


