యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్: అమలు వాయిదా.!
Published on: Thu Oct 8, 2026 4:17PM

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలక మార్పుకు సంబంధించి మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రెండున్నర వేల రూపాయలకు మించిన కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించాలన్న నిర్ణయాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేయాల్సి ఉండగా.. దానిని ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి నాటికి వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ప్రతిపాదించిన విధానం ప్రకారం రెండు వేల రూపాయలకు మించి వ్యాపారికిచేసే యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుంది. అయితే ఈ రుసుము నేరుగా వినియోగదారుడి నుంచి వసూలు చేసేది కాదు. ఇది వ్యాపారి చెల్లించాల్సిన చెల్లింపు వ్యవస్థ రుసుము.అదే75 వేలు అంత కంటే.. లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలకు గరిష్ఠంగా 300 రూపాయల పరిమితి ఉంది.

పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అమలు తేదీని కేంద్రం వాయిదా వేసింది. దసరా, దీపావళి నుంచి క్రిస్మస్ వరకు దేశవ్యాప్తంగా కొనుగోళ్లు భారీగా పెరిగే సమయంలో యూపీఐ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త ఛార్జీల విధానం అమల్లోకి వస్తే వ్యాపారులు, పేమెంట్ సంస్థలు, వినియోగదారులలో అనవసరమైన అయోమయం ఏర్పడే అవకాశం ఉందన్న ఉద్దేశంతో దీని అమలును వాయిదా వేసినట్లుచెబుతున్నారు. అదే విధంగా ఎండీఆర్ భారాన్ని వినియో గదారులపైపడకుండా వ్యవస్థను ఎలా నిర్వహించాలన్న దానిపై కూడా మరింత స్పష్టత ఇచ్చేందుకు కూడా వాయిదా వేసినట్లు చెబుతున్నారు.
[UPI MDR Implement Postponed, UPI Charges, January 2027, UPI Transactions, Digital Payments India, UPI Merchant Charges, Telugu One]


