TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ వడ్డింపు.. బ్యాంకులకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా?

Published on: Wed Sep 16, 2026 11:34AM

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వ్యవస్థకు సంబంధించి ఆర్థిక రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంత కాలం ఎటువంటి అదనపు భారం లేకుండా సాగుతున్న కొన్ని రకాల యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సంస్థలకు ఏటా దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు భారీ వార్షిక ఆదాయం సమకూరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు, బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల మౌలిక వసతులను బలోపేతం చేయడానికి, సైబర్ భద్రతను మరింత పటిష్టం చేయడానికి ఈ కొత్త నిబంధనలు దోహదపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ),  ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, రెండు వేల రూపాయలకు మించిన పర్సన్ టు మర్చంట్  యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం మేర ఎండీఆర్ వర్తించనుంది. అయితే ఈ నిబంధనల వల్ల సాధారణ వినియోగదారులపై ఎటువంటి ప్రత్యక్ష ఆర్థిక భారం పడదని అంటున్నారు. 2 వేల రూపాయలకు లోపు జరిగే సాధారణ లావాదేవీలు యథావిధిగా ఎటువంటి రుసుములు లేకుండా కొనసాగుతాయి. మొత్తం మర్చంట్ లావాదేవీల పరిమాణంలో దాదాపు 95 శాతానికి పైగా భాగాన్ని ఆక్రమించే ఈ చిన్న మొత్తాల చెల్లింపులకు పూర్తిగా మినహాయింపు లభించింది.

ఈ కొత్త విధానం ప్రకారం..  వ్యాపారులు లేదా మర్చంట్లు మాత్రమే ఈ ఎండీఆర్ రుసుమును భరించాల్సి ఉంటుంది. వినియోగదారులు తాము కొనుగోలు చేసే వస్తువులు, సేవలకూ సాధారణ ధర మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ రూ. 3వేల రూపాయల చెల్లింపు జరిగితే మర్చంట్ 0.4 శాతం చొప్పున కొంత మొత్తం చెల్లిస్తారు, కానీ కస్టమర్ ఖాతా నుంచి ఎలాంటి అదనపు రుసుము మినహాయించబడదు. అలాగే పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు సంబంధించి గరిష్ట పరిమితిని కూడా నిర్దేశించారు.  75 వేల రూపాయలు అంతకంటే  అంతకంటే ఎక్కువ మొత్తాల లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీని 300 రూపాయల గరిష్ట క్యాప్ అమర్చారు.

మరోవైపు, దేశంలో యూపీఐ నెట్‌వర్క్ వినియోగం రోజురోజుకూ అసాధారణ రీతిలో విస్తరిస్తోంది.  కోట్లాది మంది వినియోగదారులు ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ భారీ స్థాయి కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి, సర్వర్ సామర్థ్యాన్ని పెంచడానికి, మోసాలను అరికట్టడానికి, అలాగే  నిరంతర సాంకేతిక మద్దతు అందించడానికి భారీ ఎత్తున నిధులు అవసరమవుతున్నాయి. ఇంతకాలం ఈ మౌలిక వసతుల నిర్వహణ భారాన్ని ప్రధానంగా బ్యాంకులు,  పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లే భరిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సబ్సిడీలపై మాత్రమే పూర్తిగా ఆధారపడకుండా, వ్యవస్థను ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించేలా తీర్చిదిద్దడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. 

ఈ కొత్త ఆదాయ నమూనా ద్వారా బ్యాంకులు గణనీయమైన వాటాను దక్కించుకోనున్నాయి.  అలాగే రైల్వేలు, బీమా, ఇంధన కొనుగోళ్లు, టెలికాం వంటి కొన్ని ప్రత్యేక రంగాల చెల్లింపులకు కేవలం రూ. 5 ఫ్లాట్ ఛార్జ్ వర్తింపజేయగా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్ల లావాదేవీలకు 0.02 శాతం మేర తక్కువ ఎండీఆర్ నిబంధనలను పొందుపరిచారు. చిన్న వ్యాపారులకు మరియు పర్సన్-టు-పర్సన్ (  బదిలీలకు ఎటువంటి రుసుములు లేకుండా మినహాయింపులు కొనసాగుతుంది.

భవిష్యత్తులో డిజిటల్ ఆర్థిక లావాదేవీల రంగాన్ని మరింత సురక్షితంగా, వేగంగా విశ్వసనీయంగా మార్చడంలో ఈ విధానం కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. సాంకేతిక ఆధునికీకరణకు నిరంతరం నిధులు అందుబాటులో ఉండటం వల్ల భద్రతా ప్రమాణాలు మరింత పెరుగుతాయి. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, కేవలం మర్చంట్ స్థాయిలో మాత్రమే సర్దుబాటు అయ్యే ఈ సరికొత్త నిబంధనలు డిజిటల్ పేమెంట్స్ రంగానికి ఒక సరికొత్త ఆర్థిక దిశను నిర్దేశించనున్నాయని భావిస్తున్నారు.

[UPI MDR Charges, UPI Revenue Banks, 20000 Crore Revenue, UPI Transactions,  Above 2000, National Payments Corporation of India]