దీపావళి తరువాతే: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు.. వెనక్కు తగ్గిన కేంద్రం.!
Published on: Tue Oct 13, 2026 2:47PM

డిజిటల్ చెల్లింపులు చేసే వ్యాపారులకు పండగ వేళ ఊరట లభించింది. యూపీఐ ద్వారా జరిగే కొన్ని వ్యాపార లావాదేవీలపై విధించనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీల అమలును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వాయిదా వేసింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ ఛార్జీలను ఇప్పట్లో అమలు చేసేది లేదని పేర్కొంది. ఈ చార్జీలను దీపావళి తర్వాత అమలు చేయాలని ప్రాథమికంగా డెసిషన్ తీసుకుంది. పండగ సీజన్‌లో వ్యాపారులపై అదనపు భారం పడకుండా ఉండేందుకు వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మంగళవారం (అక్టోబర్ 13)జరిగిన యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఛార్జీల అమలును వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఛార్జీల రేట్లలో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అంటే, ఎంపిక చేసిన వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే యూపీఐ లావాదేవీలపై గతంలో నిర్ణయించిన ఎండీఆర్ విధానమే కొనసాగనుంది. దీపావళి తర్వాత ఏ తేదీ నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయన్నది ప్రకటించచాల్సి ఉంది. పండగల సమయంలో దుకాణాలు, రిటైల్ వ్యాపారాలు, ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ సమయంలో డిజిటల్ చెల్లింపులపై అదనపు నిర్వహణ ఖర్చులు ఏర్పడితే వ్యాపారులపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అందుకే అమలును కొంతకాలం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
[UPI charges Impliment Postpone, PaCI UPI charges, Deferral UPI charges, MDR charges, Diwali, Telugu One]


