జీఎస్టీ విధానంలో మార్పులు.. వ్యాపారులపై పడే ప్రభావం ఏంటంటే.?
Published on: Fri Oct 23, 2026 10:58AM

దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సరళం చేయడానికి మరియు పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా చేయడానికీ కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా జీఎస్టీ విధానాన్ని మరింత సరళతరం, సులభతరం చేయనుంది. ప్రధానంగా చిన్న వ్యాపారాలు, ఈ కామర్స్ విక్రేతలు, పన్నుచెల్లింపుదారులు దీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా నూతన సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది.
పన్ను చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా మార్చడంతో పాటు, అనవసరమైన లీగల్ చిక్కులను తగ్గించడమే ఈ సంస్కరణల లక్ష్యంగా చెబుతోంది. ఈ కొత్త నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది చిన్న వ్యాపారులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. వివిధ రాష్ట్రాల్లో విడిగా భౌతిక కార్యాలయాలు లేదా గోదాములు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా, ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వేర్‌హౌస్‌ల ద్వారానే జాతీయ మార్కెట్‌ను సులువుగా యాక్సెస్ చేసే సదుపాయం ఈ సంస్కరణల ద్వారా కలుగుతుంది.

దీనివల్ల చిన్న వ్యాపారస్తుల పై పడే అదనపు పన్ను భారం భారీగా తగ్గుతుంది. అలాగే నెలకు రెండున్నర లక్షల రూపాయల వరకూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) బదిలీ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి జీఎస్టీ పోర్టల్‌లో యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు, డ్రాప్, డౌన్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల తప్పుల తడకగా పేర్కొంటూ దరఖాస్తులు తిరస్కరణ గణనీయంగా తగ్గిపోతుంది. మరోవైపు, ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ రిఫండ్లను ఎలాంటి ఆఫీసర్ జోక్యం లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థద్వారా వేగంగా మంజూరు అవుతుంది.
జీరో రేటెడ్ సప్లైస్, ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కింద క్లెయిమ్ చేసిన రిఫండ్ మొత్తంలో 90 శాతం నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రొవిజినల్ పద్ధతిలో తక్షణమే విడుదల అవుతాయి. అలాగే అనవసరమైన వివాదాలను తగ్గించేందుకు షో కాజ్ నోటీసులు జారీ చేయడానికి 10 వేల కనీస పరిమితి నిబంధన అందుబాటులోకి వస్తుంది. ఈ కీలక మార్పుల ద్వారా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ వేగవంతం కావడంతో పాటు, వ్యాపార వర్గాల వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు దాదాపుగా పరిష్కారమవుతాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
[Union Governmeny Gst Reforms, Central Government Gst, Ease Doing Business, Fast Gst Refunds, Telugu One]


