కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఆమోదం.!
Published on: Fri Nov 27, 2026 1:37PM
.webp)
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సేవా తీర్థ్‌లో జరిగిన ఈ భేటీలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
లోక్‌సభ రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే అంశంపై మంత్రివర్గం సానుకూలంగా స్పందించింది. చట్టనిర్మాణ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఈ బిల్లుకు పచ్చజెండా ఊపింది.
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే బిల్లుకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. జనగణనతో సంబంధం లేకుండా పునర్విభజన ప్రక్రియ జరిగేలా నిబంధనల్లో పలు మార్పులు చేసినట్లు సమాచారం.
ఈ రెండు బిల్లులను త్వరలోనే పార్లమెంట్ ఉభయ సభల ముందుకు తీసుకురావడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఉభయ సభల్లో వీటిపై విస్తృత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇది కూడ చదవండి: వంద రోజుల విరామానికి తెర.. నవంబర్ 30 నుంచి పార్లమెంట్ భేటీ.!
మహిళా సాధికారత దిశగా ఇది చారిత్రక ముందడుగు అని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వివిధ రాష్ట్రాల వైఖరి, ప్రతిపక్ష పార్టీల స్పందన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్యలో వచ్చే మార్పులపై దక్షిణాది రాష్ట్రాలు సహా పలు ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలు కీలకంగా మారనున్నాయి. విపక్షాలు పార్లమెంట్లో ఏ విధమైన అభ్యంతరాలు లేవనెత్తుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
.webp)
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. వీటి తుది రూపం మరియు అమలు విధానాలపై ప్రజల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది.
మీకు నచ్చవచ్చు: పురుషులకూ పెటర్నటీ లీవ్: తమిళనాడు సర్కార్ నిర్ణయం.. సర్వత్రా హర్షం.!
మీకు నచ్చవచ్చు: సీఎం ఫోన్ ట్యాప్: కేరళం ముఖ్యమంత్రిపై నిరంతర నిఘా: స్వయంగా వెల్లడించిన సతీశన్.!
[ Union Cabinet, Womens Reservation Bill, Delimitation Bill, PM Narendra Modi, Parliament Sessions ]


