ఐక్యరాజ్య సమితి భేటీకి మోడీ, షీజిన్ పింగ్ డుమ్మా.. ఎందుకంటే?
Published on: Mon Sep 21, 2026 11:56AM

ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ డుమ్మా కొట్టడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. జరుగుతున్న ఈ అత్యున్నత స్థాయి భేటీకి.. కీలక దేశాలైన ఇండియా, చైనా అధినేతలు గైర్హాజర్ కావాలని నిర్ణయించుకోవడం పట్ల ప్రపంచ దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ భేటీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం హాజరు కాబోనని ప్రకటించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో, మోడీ జిన్ పింగ్, పుతిన్ ల గైర్హాజరీ ఐరాస వేదికపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఈసారి ఐరాస సమావేశాల ప్రధాన అజెండాలో ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధాలు, ద్రవ్యోల్బణం,ఏఐ ముప్పు అంశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఏఐ సృష్టిస్తున్న కొత్త, కొత్త ప్రమాదాలపై అంతర్జాతీయ స్థాయిలో కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో మోడీ, జిన్ పింగ్, పుతిన్ వంటి కీలక నేతలు ఐరాసా భేటీకి దూరంగా ఉండటం సంచలనం గా మారింది. కాగా ఇండియా తరఫున ఈ భేటీకి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరౌతున్నారు. అయినప్పటికీ మోడీ, జిన్ పింగ్, పుతిన్ ల గైర్హాజరీ ఐరాస ప్రభావంపై అనుమానాలకు తావిస్తున్నది. వారి ఆబ్సెన్స్ లో జరిగే ఈ సమావేశం ఏ మాత్రం ప్రభావం చూపుతుందన్నది వేచి చూడాల్సి ఉంది.
[UNGA Session 2026, Modi Jinping Putin Skip, United Nations General Assembly, S Jaishankar, Global Conflicts, Telugu One]


