ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి పోటెన్సీ టెస్ట్‌పై ట్విస్ట్..!
Published on: Tue Sep 1, 2026 7:44PM
.webp)
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహించాలంటూ రాజేంద్రనగర్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయ స్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు నేపథ్యంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డికి లైంగిక పటుత్వ పరీక్ష నిర్వహించాలని పోలీసులు కోరారు. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని III అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ XXV అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు 17న దర్యాప్తు అధికారికి అనుమతి ఇచ్చింది.
BNSSలోని సెక్షన్ 52 ప్రకారం ఈ పరీక్షకు అనుమతి ఇచ్చినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అయితే కింది కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని సెక్షన్ల ప్రకారం పొటెన్సీ పరీక్ష నిర్వహించేందుకు పోలీసులకు చట్టపరమైన అధికారం లేదని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. కేసు దర్యాప్తు సమగ్రంగా సాగేందుకు పొటెన్సీ పరీక్ష అవసర మని తెలిపారు. దర్యాప్తు లో భాగంగానే పరీక్షను కోరుతున్నామని కోర్టుకు వివరించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జె. శ్రీనివాసరావు తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహిం చాలా? వద్దా? అన్నది హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. ఉదయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు పొటెన్సీ పరీక్ష నిర్వహించబోమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. దీంతో దర్యాప్తు అధికారిని పరీక్ష కోసం ఒత్తిడి చేయ వద్దని న్యాయమూర్తి ఆదేశించారు.. మంగళ వారం పిటిషన్‌పై విచారణ చేపట్టిన అనంతరం తాజాగా వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ అయింది. తీర్పు వెలువడే వరకు ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుపైనే ఉత్కంఠ నెలకొంది.
Uday Krishna Reddy Potency Test, Rajendranagar Court, Telangana High Court, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, Hyderabad police, Telugu One, Telugu news


