TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాక్ వైమానిక స్థావరాల్లో టర్కీ, చైనా విమానాలు.. అసలేం జరుగుతోంది?

Published on: Mon Aug 24, 2026 9:48AM

పాకిస్థాన్ కు భారీగా ఆయుధాల సరఫరా అంశం ఇప్పుడు  దక్షిణాసియా రాజకీయాల్లో  చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ గగనతలంలో   ప్రత్యక్షమవుతున్న విదేశీ సైనిక విమానాలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.   60 గంటల వ్యవధిలో పెద్ద సంఖ్యలో టర్కీకి చెందిన   సి-130 హెర్క్యులస్ సైనిక రవాణా విమానాలు పాకిస్థాన్‌కు వచ్చి వెళ్లడం సంచలనంగా మారింది.  ఆగస్టు 19 నుంచి ఆగస్టు 21 మధ్య చోటుచేసుకున్న ఈ   సైనిక రాకపోకలు, శత్రుదేశాల కదలికలపై నిశితంగా క అంతర్జాతీయ నిఘా సంస్థలు  అప్రమత్తం చేశాయి.

రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరం, అలాగే కరాచీలోని మస్రూర్ వైమానిక స్థావరాలలో  టర్కీ సైనిక విమానాలు పదేపదే ల్యాండ్ అయ్యాయి. అంత తక్కువ సమయంలో, అంతటి భద్రతా ప్రాముఖ్యత ఉన్న వైమానిక స్థావరాలలో ఈ స్థాయిలో సైనిక విమానాల రాకపోకలు పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.   అంతేకాకుండా, టియుఎఎఫ్ 526   అనే ప్రత్యేమైన కాల్‌సైన్‌తో రికార్డైన టర్కీకి చెందిన మరొక భారీ ఎ-400ఎమ్  సైనిక విమానం పాకిస్థాన్‌లోని మురిద్ స్థావరంలో కనిపించడం ఈ అనుమానాలకు  బలాన్ని చేకూర్చింది. 

అసలు ఈ విమానాల్లో టర్కీ నుంచి పాకిస్థాన్‌కు తరలించినది ఏమిటి? అంటే.. వాటి ద్వారా పాకిస్థాన్ కు భారీగా  ఆయుధాలు.. అత్యాధునిక డ్రోన్లు, వాటి నిర్వహణకు సంబంధించిన   డిజిటల్ వ్యవస్థలు అన్న అనుమానాన్ని నిఘా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  వీటితో పాటు,  హెచ్‌క్యూ-సిరీస్   ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా  పాక్ స్థావరాలకు ఈ విమానాల ద్వారా చేరి ఉండోచ్చని నిఘావర్గాలు చెబుతున్నాయి.   టర్కీ విమానాలు నూర్ ఖాన్, మస్రూర్ స్థావరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సమయంలోనే..  చైనాకు చెందిన సైనిక రవాణా విమానాల కదలికలు కూడా అక్కడ కనిపించడం మరింత ఆందోళనకరంగా మారింది.  

ఇది టర్కీ, పాకిస్థాన్,  చైనా దేశాల మధ్య పెరుగుతున్న త్రైపాక్షిక సైనిక ,  రక్షణ సంబంధాలకు  నిదర్శనంగా చెబుతున్నారు.  పాకిస్థాన్ గతంలోనే టర్కీ నుంచి  బైరక్టార్ రక్షణ డ్రోన్లను కొనుగోలు చేసిన విషయంతెలిసిందే. ఇటీవల ఆగస్టు 7న పాకిస్థాన్, టర్కీ,  సౌదీ అరేబియాల మధ్య చారిత్రాత్మకమైన మక్కా ఉమ్మడి రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ త్రైపాక్షిక భద్రతా ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఈ మూడు దేశాల్లో ఏ   దేశంపై విదేశీ దాడి జరిగినా, అది మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే భావించి ఉమ్మడిగా స్పందిస్తాయి. ఈ కీలక భద్రతా ఒప్పందం కుదిరిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో భారీ సైనిక విమానాల కదలికలు సాగడం గమనార్హం.

  ఈ సైనిక విమానాలలో ఏం  తరలించారనే దానిపై టర్కీ గానీ, పాకిస్థాన్ ప్రభుత్వం గానీ  ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడంతో ఆయుధాల సరఫరా అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.  కేవలం రాడార్ సమాచారం, విమానాల కదలికలు, అంతర్జాతీయ నిఘా వర్గాల ప్రాథమిక సమాచారం ఆధారంగానే ఈ వివరాలు బయటకు వచ్చాయి.  

Turkish military aircraft in Pakistan, C130 Hercules Rawalpindi, Turkey Pakistan drone supply, HQ air defense systems, Mecca joint defense agreemen