TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీటీడీ పాలక మండలి స్థానంలో స్పెసిఫైడ్ అధారిటీ: నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.!

Published on: Mon Nov 2, 2026 4:05PM

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి పదవీకాలం ముగియడంతో, దేవస్థానం రోజువారీ పరిపాలనా వ్యవహారాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ   టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను  ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక  కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

ఈ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా  టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రను ప్రభుత్వం నియమించింది. అలాగే  ఆర్థిక శాఖ   కార్యదర్శి వి. వినయ్ చంద్, రెవెన్యూ (దేవాదాయ) శాఖ   కార్యదర్శి (ఎఫ్ఏసీ) కె. కన్నబాబులను  కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ ముగ్గురు అధికారులు తిరుమల క్షేత్ర పరిపాలనతో పాటు భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన  చర్యలు, నిర్ణయాలను పర్యవేక్షిస్తారు.

ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్,   సెక్షన్ 137 కింద ఉన్న చట్టబద్ధమైన అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయి పాలకమండలికి ఉండే సర్వాధికారాలు, విధులు, నిర్ణయాత్మక అధికారం ఈ ప్రత్యేక కమిటీకి సంక్రమిస్తాయి.  ఈ కమిటీ పదవీకాలం ఒక సంవత్సరం పాటు లేదా కొత్త పాలకమండలి నియామకం జరిగే వరకూ..అంటే వీటిలో  ఏది ముందయితే అప్పటివరకు కొనసాగుతుంది.  స్వామివారి దర్శనాలు, నిత్య కైంకర్యాలు, వసతి,  భక్తుల సేవల్లో ఎలాంటి అవరోధాలు కలగకుండా ఈ అథారిటీ సుపరిపాలన అందిస్తుందని అధికారులు పేర్కొన్నారు.


[TTD Specified Authority, Muddada Ravichandra,  Chairman, TTD Board Tenure Complete, Tirumala Tirupati Devasthanams News, Telugu One]