TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆయన అక్రమాస్తులు రూ.5 కోట్లు పైనే.!

Published on: Thu Sep 3, 2026 12:14PM

టీటీడీ డిప్యూటీ ఈవో అక్రమాస్తుల చిట్టా కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. ఏసీబీ బుధవారం టీటీడీ డిప్యూటీ ఈవో  మెండ లోకనాథం నివాసాలలో జరిపిన సోదాల్లో ఆయన ఏకంగా 500 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు కూడబెట్టినట్లు బయటపడింది. దీంతో మెండ లోకనాథంను ఏసీబీ అధికారులు  అరెస్ట్ చేశారు. తిరుమల తిరుపతి ప్రతిష్టను మంటగలిపేలా ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్నవిశ్వసనీయ సమాచారంతో ఏసీబీ  ఉమ్మడి తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆయనకు సంబంధించిన నాలుగు కీలక ప్రాంతాల్లో  ఏకకాలంలో సోదాలు నిర్వహంచిన సంగతి తెలిసిందే.   తిరుపతిలోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లు, ఎర్రపాలెం సమీపంలోని ఆయన పూర్వీకుల ఇల్లు అలాగే  తిరుమలలోని ఆయన అఫీషియల్ ఛాంబర్లలో ఏకకాలంలో  ఈ తనిఖీలు జరిగాయి.  

ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ. 5 కోట్ల విలువైన స్థిరచరాస్తులతో పాటు,  2 కిలోల బంగారం,ఆరున్నర కిలోల వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్‌లో భార్య పేరిట విలాసవంతమైన ఇల్లు, గొల్లవానిగుంట ప్రాంతంలో రెండు ఖాళీ స్థలాలు,  ఒక భవనం, వడమాలపేట మండలం పాడిరెడు అరణ్యం గ్రామంలో ఇంటి స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  

అలాగే శ్రీనివాసపురం రెసిడెన్షియల్ ఏరియాలో కుమారుడి పేరుపై మరో ప్లాట్‌నూ  గుర్తించారు. ఇవే కాకుండా వివిధ బంధువుల పేరిట ఉన్న నాలుగు భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా అధికారులు సీజ్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సీబీఐ చేపట్టిన దర్యాప్తులో వెలుగుచూసిన కీలక సమాచారం ఆధారంగానే  ఈ దాడులు జరిగినట్లు చెబుతున్నారు.  గతంలో సీబీఐ విచారణలో   టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ,  కే. చిన్న అప్పాలపై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా   ఈ అవినీతి బండారం బయటపడింది. 

టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి  టీటీడీ  డిప్యూటీ ఈవో స్థాయికి చేరిన లోకనాథం, విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అక్రమ మార్గంలో సంపాదన ఆర్జించినట్లు ఏసీబీ తేల్చింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ దాడులు జరిగాయన్న ప్రచారాన్ని ఏసీబీ   ఖండించింది. కేవలం న్యాయస్థానం జారీ చేసిన సెర్చ్ వారెంట్లు,  పక్కా ఆధారాలతోనే  ఈ సోదాలు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. 


[TTD Deputy EO Lokanatham, ACB raids Tirupati, TTD corruption case, Lokanatham disproportionate assets, Tirumala Tirupath,   AP anti corruption bureau]