ముగుస్తున్న టీటీడీ పాలక మండలి పదవీ కాలం: నూతన పాలకమండలిపై సర్కార్ కసరత్తు.!
Published on: Fri Oct 30, 2026 10:29AM
.webp)
తిరుమల తిరుపతి దేవస్థానం మండలి పదవీకాలం ముగియనుండటంతో ఇప్పుడు కొత్త పాలక మండలిపై సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. తదుపరి పాలకమండలి సారథి(చైర్మన్) ఎవరు, సభ్యులుగా ఎవరెవరికి స్థానం దక్కుతుంది అన్న అంశంపై పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు టీటీడీ పాలకమండలిపై ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. స్థానిక సమరం, కోడ్ కారణంగా ప్రకటన చేయలేదు. అదలా ఉంచితే.
ప్రస్తుత బోర్డు హయాంలో చేపట్టిన పలు సంస్కరణలు, భక్తులకు కల్పించిన వసతులు, వివాదాలపై సమీక్ష జరుగుతుండగానే, మరోవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చ సాగుతోంది. ఎలాంటి విమర్శలకు,వివాదాలకూ తావులేకుండా, పాలనా దక్షత, ఆధ్యాత్మిక భావన మెండుగా ఉన్న అనుభవజ్ఞుడైన వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులు, పారిశ్రామిక ప్రముఖుల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా కష్టకాలంలో పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలిచిన సీనియర్ నేతలతో పాటు, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ప్రముఖులకు ఈ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే, ఇప్పటికే టీటీడీ చైర్మన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
.webp)
ప్రస్తుత టీటీడీ పాలక మండలి ఈ రెండేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల విజయవంతం, భక్తుల రద్దీని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలు, క్యూలైన్లలో వసతులు మెరుగుపరచడం వంటి అంశాలు ఒకవైపు ప్రశంసలు అందుకోగా, రాజకీయ వివాదాలు కూడా తెరపైకి వచ్చాయి. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, రాబోయే రోజుల్లో సంస్థ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేలా సమర్థవంతమైన నాయకత్వాన్ని వ్యక్తికి టీటీడీ చైర్మన్ పగ్గాలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కొత్త టీటీడీ ధర్మకర్తల మండలిని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కొత్త ఛైర్మన్‌తో పాటు పూర్తి స్థాయి సభ్యుల జాబితాను ఒకేసారి వెల్లడించాలని ప్రభుత్వం భావిస్తోంది.
[TTD Board tenure Coming To End, TTD Chairman, Tirumala Tirupati Devasthanams, Andhra Pradesh, CM Chandrababu, New board, Telugu One]


