Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టారిఫ్‌ల పెంపుపై ట్రంప్ యూ టర్న్
posted on: Jan 22, 2026 11:20AM
.webp)
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే విషయంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటామనీ, ఈ విషయంలో తమను వ్యతిరేకించే దేశాలపై అదనపు సుంకాలను విధిస్తామంటూ హెచ్చరికలు చేసిన ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆర్కిటిక్ భద్రతకు సంబంధించి నాటోతో ఒక ఒప్పందానికి మార్గం సుగమమైందని, ఈ నేపథ్యంలో యూరప్ దేశాలపై విధించాలనుకున్న టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన సంక్షోభానికి తాత్కాలికంగానైనా తెరపడింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడిన ట్రంప్ గ్రీన్‌ల్యాండ్ హక్కు, టైటిల్, యాజమాన్యం తమకు కావాలనీ కానీ దాని కోసం సైనిక బలగాలను ఉపయోగించబోమని స్పష్టం చేశారు.
ఇటీవల గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయడంలో అడ్డంకులు సృష్టిస్తున్నాయన్న కారణంతో నార్వే, డెన్మార్క్ స్వీడన్, ఫ్రాన్స్, యూకే, నెదర్లాండ్స్, జర్మనీ, ఫిన్ లాండ్ సహా 8 యూరోపియన్ దేశాలపై 10 శాతం టారీఫ్ లు విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మిత్రదేశాల మధ్య వాణిజ్య పరమైన వార్ నడుస్తున్నది.
దానిపై దావోస్ సదస్సు సందర్భంగా ట్రంప్, నాటో చీఫ్ మార్క్ రుట్టే మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంతానికి సంబధించి ఒక ఫ్రేమ్ వర్క్ నాటోతో ఒప్పందం కుదిరిందని ఆ చర్చల తరువాత ట్రంప్ వెల్లడించారు. ఈ ఒప్పందం వల్ల అమెరికాతో పాటు అన్ని నాటో సభ్య దేశాలకు మేలు జరుగుతుందని, ఈ ఒప్పందం వల్ల ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన సుంకాలను రద్దు చేసినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా పేర్కొన్నారు.


.webp)



