రైలు బోగీలో మూత్రవిసర్జన: దేహశుద్ధి చేసి..శుభ్రం చేయించిన తోటి ప్రయాణికులు.!
Published on: Mon Sep 28, 2026 7:18PM
.webp)
రైళ్లలో ప్రయాణించే సమయంలో కొందరు వ్యక్తులు ప్రదర్శించే బాధ్యతారాహిత్యపు చర్యలు తోటి ప్రయాణికులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కనీస ఇతరుల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించే వారిపై ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఒక రైలు జనరల్ కోచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన ప్రవర్తనతో తోటి ప్రయాణికుల సహనాన్ని పరీక్షించడమే కాకుండా, పెద్ద ఎత్తున వివాదానికి కేంద్రబిందువుగా మారాడు.
రైలులోని జనరల్ బోగీ రద్దీగా ఉన్న సమయంలో సదరు వ్యక్తి టాయిలెట్‌ను ఆశ్రయించాల్సింది పోయి, నేరుగా బోగీ లోపలే బహిరంగంగా మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. చుట్టూ మహిళలు, చిన్నారులు ఉన్నారన్న కనీస స్పృహ కూడా లేకుండా అతడు ఈ పనిచేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై అతడిని ఈ చర్య నుంచి వారించారు. టాయిలెట్ ఉపయోగించాలని గట్టిగా హితవు పలికారు. అయితే, తన తప్పును క్షమించమని కోరాల్సింది పోయి, సదరు వ్యక్తి ప్రయాణికులతోనే ఎదురుదాడికి దిగి వాగ్వాదానికి తెగబడ్డాడు.

అతడి అహంకారపూరిత వైఖరితో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఒక ప్రయాణికుడు ముందుకు వచ్చి అతడిని నిలదీశాడు. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పెరగడంతో, ప్రయాణికులు సదరు వ్యక్తికి గట్టిగా దేహశుద్ధి చేశారు.కేవలం కొట్టడంతోనే ఆగకుండా, తాను చేసిన పనికి పశ్చాత్తాపం కలిగేలా ఆ మురికి ప్రదేశాన్ని స్వయంగా అతడి చేతనే శుభ్రం చేయించారు. తోటి ప్రయాణికుల భద్రత, పరిశుభ్రతను దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు తగిన శాస్తి చేశారు.
ఈ మొత్తం తతంగాన్ని కొందరు తోటి ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌లో ఈ ఉదంతంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ సదరు వ్యక్తిని విమర్శిస్తున్నారు.ఈ ఘటనపై స్పందించిన 'రైల్వే సేవా' అధికారులు బాధితులు లేదా వీడియో షేర్ చేసిన వారిని పూర్తి వివరాలు అందించాల్సిందిగా కోరారు. రైళ్లలో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెనగాలని, ఇలాంటి అసాంఘిక, బాధ్యతారహిత చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే శాఖ మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
[ Train travel, urination incident, railway service, viral video, passenger hygiene, Indian Railways, Train Urination, Viral Video, General Coach Incident, Railway Passengers Action, Passenger Thrashed ]


