TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెట్టుకొమ్మ నిమజ్జనంలో అపశ్రుతి: జార్ఖండ్ లో ఐదుగురు మృతి.!

Published on: Wed Sep 23, 2026 12:04PM

గణేష్ నిమజ్జన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో ఆదివాసీ సంప్రదాయ వేడుకలలో భాగంగా పూజించిన చెట్టుకొమ్మను  నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు.

మృతులలో ముగ్గరు మైనర్లు ఉన్నారు.  చెట్టు కొమ్మ పూజా కార్యక్రమం పూర్తయిన తరువాత  నదిలో నిమజ్జనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నదిలో ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో నదిలోకి దిగిన వారిలో ఐదుగురు ప్రవాహంలో కొట్టుకు పోయారు. 

సంఘటన జరిగిన వెంటనే స్థానిక జాలర్లు నదిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. కొద్ది సేపటి తరువాత ఐదుగురి మృతదేహాలనూ వెలికి తీయగలిగారు.  ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

{Tragedy, Nimajjanam, Jhakhan, Five Drowned, River, Three Minors, Telugu One}