TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుపతి మేయర్ పీఠం కూటమిదే..మేయర్ అభ్యర్థిగా జేబీ శ్రీనివాస్ ఘన విజయం.!

Published on: Tue Nov 3, 2026 7:38PM

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 66 డివిజన్లకు గాను 60 స్థానాలను కైవసం చేసుకుని మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన టీడీపీ నేత మన్యం శ్రీనివాస ప్రసాద్ అలియాస్ జేబీ శ్రీనివాస్ 61,712 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

పార్టీల వారీగా ఫలితాలను పరిశీలిస్తే.. టీడీపీ 36 డివిజన్లలో విజయం సాధించగా, మరో రెండు స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. జనసేన 19, బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో కూటమి బలం మొత్తం 60 డివిజన్లకు చేరింది.

మరోవైపు, వైఎస్సార్‌సీపీ మూడు డివిజన్లలో విజయం సాధించగా.. స్వతంత్ర అభ్యర్థులు కూడా మూడు స్థానాలను దక్కించుకున్నారు. మొత్తం 66 డివిజన్ల ఫలితాలు వెలువడటంతో తిరుపతి నగరపాలక సంస్థపై ఎన్డీఏ కూటమి ఆధిపత్యం స్పష్టమైంది.

పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు:

టీడీపీ – 36

టీడీపీ (ఏకగ్రీవం) – 2

జనసేన – 19

బీజేపీ – 3

వైఎస్సార్‌సీపీ – 3

స్వతంత్రులు – 3

మొత్తం – 66 డివిజన్లు


[ Tirupati Municipal Corporation, Tirupati Election Results 2026, NDA Alliance, TDP, Jana Sena, BJP, JB Srinivas, Manyam Srinivasa Prasad, Tirupati Mayor, Mayor Election Results, 61712 Votes Majority, Municipal Elections, Andhra Pradesh Politics, YSRCP, TDP Victory, Tirupati Divisions ]