తిరుపతికి విమాన రాకపోకల కొత్త షెడ్యూల్.!
Published on: Tue Sep 1, 2026 11:45AM

తిరుపతికి రాకపోకలు సాగించే విమానాలను రీషెడ్యూల్ చేశారు. కొత్త షెడ్యూల్ ప్రమారం విమానాల రాకపోకలు మంగళవారం (సెప్టెంబర్ 1) నుంచి అమలులోకి వచ్చాయి. ప్రయాణికుల రాకపోకల అవసరాలు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని విమానయాన సంస్థలు ఈ నూతన షెడ్యూల్ ఖరారు చేశాయి.
ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, తిరుపతి మధ్య నడిచే ఉదయం తొలి సర్వీసు ఉదయం 7.20 గంటలకు తిరుపతి చేరుకుని, తిరిగి ఉదయం 8. 00 గంటలకు బయలుదేరుతుంది. అలాగే మరొక హైదరాబాద్ సర్వీసు ఉదయం 11.15 గంటలకు వచ్చి, 11. 45 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది. మధ్యాహ్నం వేళలో హైదరాబాద్ నుంచి వచ్చే విమానం 1. 50 గంటలకు తిరుపతి చేరుకుని, తిరిగి 2. 30 గంటలకు బయలుదేరనుంది.
విశాఖపట్నం నుంచి తిరుపతికి వచ్చే సర్వీసు మధ్యాహ్నం మూడున్నర గంటలకు చేరుకుని, తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు తిరుగు ప్రయాణమౌతుంది. ఢిల్లీ నుంచి తిరుపతికి వచ్చే సర్వీసు సాయంత్రం 6.25 గంటలకు చేరుకుని, రాత్రి 7.05 గంటలకు తిరుగు ప్రయాణం అవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే రాత్రి సర్వీసు 8.20 గంటలకు తిరుపతి చేరుకుని, రాత్రి తిరుగు ప్రయాణం అవుతుంది.
మరికొన్ని ప్రైవేట్ విమానయాన సంస్థల సర్వీసుల్లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ ఎయిర్‌లైన్స్ సర్వీస్‌కు చెందిన శివమొగ్గ, తిరుపతి విమానం మధ్యాహ్నం 12.20 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని, తిరిగి సాయంత్రం 6. 00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరనుంది. అదే విధంగా ఎయిర్ ఇండియాకు చెందిన హైదరాబాద్, తిరుపతి సర్వీసు సాయంత్రం 5. 10 గంటలకు వచ్చి, తిరిగి సాయంత్రం 6. 00 గంటలకు బయలుదేరుతుందని అధికారులు పేర్కొన్నారు.
[Tirupati Airport Flight Timings, Tirupati Airport Revised Schedule, Renigunta Airport Flight Details, Tirumala Devotees Air Services, Hyderabad Tirupati Flights Schedule]


