TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల శ్రీవారికి భక్తుల కానుకలు: కొత్త రికార్డులు సృష్టిస్తున్న హుండీ ఆదాయం.!

Published on: Tue Oct 6, 2026 2:29PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్తులతో నిత్యం కిటకిటలూడుతుంటుంది. ఇటీవలి కాలంలో భక్తుల తాకిడి మరింత పెరిగింది. పెరిగిన రద్దీకి తగినట్లుగానే శ్రీవారి హుండీ ఆదాయం కూడా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. టీటీడీ వెల్లడించిన వివరాల మేరకు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అంటే ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లోనే శ్రీవారి హుండీ ద్వారా రూ.1,129.04 కోట్ల ఆదాయం వచ్చింది.    ఒక్క జులై నెలలోనే  శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.140.25 కోట్లు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో   ఒక నెలలో వచ్చిన అత్యధిక హుండీ ఆదాయంగా కొత్త రికార్డు సృష్టించింది. 

ఈ ఏడాది తొలి తొమ్మిది నెలలోనూ ఏ నెల కానె శ్రీవారి హుండీ ఆదాయం భారీగా వచ్చిందని టీటీడీ పేర్కొంది.  జనవరిలో రూ.124.36 కోట్లు, ఫిబ్రవరిలో రూ.110.92 కోట్లు, మార్చిలో రూ.125.24 కోట్లు, ఏప్రిల్‌లో రూ.115.84 కోట్లు, మేలో రూ.120.28 కోట్లు, జూన్‌లో రూ.128.30 కోట్ల ఆదాయం నమోదైంది. జూలైలో గరిష్ఠంగా రూ.140.25 కోట్లు రాగా, ఆగస్టులో రూ.137.44 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.126.41 కోట్లు వచ్చాయి. నెలవారీ ఆదాయంతో పాటు రోజువారీ హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.  సెప్టెంబర్ 10న ఒక్కరోజే రూ.6.94 కోట్ల కానుకలు వచ్చాయి. ఇది టీటీడీ చరిత్రలో నాలుగో అత్యధిక రోజువారీ హుండీ ఆదాయంగా టీటీడీ తెలిపింది. 

[Tirumala Srivari Hundi Income New Record,  Tirumala Hundi income, TTD Hundi income,   Lord Venkateswara, Tirumala News, Telugu One]