TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నుల పండువగా తిరుమలేశుని చక్రస్నానం: ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.!

Published on: Wed Sep 23, 2026 6:04PM

కలియుగ వైకుంఠమైన తిరుమలలో తొమ్మి రోజుల పాటు   వైభవంగా జరిగిన శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం (సెప్టెంబర్ 23) శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నాన మహోత్సవాన్ని శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా,  పవిత్రంగా నిర్వహించారు. శ్రీవారి చక్రస్నాన ఘట్టాన్ని  కనులారా వీక్షించేందుకు, అలాగే పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.   ఉత్సవాల చివరి రోజు ఉత్సవ కాండలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో పాటు ఆలయ పరిధిలో వివిధ కైంకర్యాలు   పూర్తిచేశారు. 

తెల్లవారుజాము సమయం నుంచే శ్రీమలయప్ప స్వామి వారిని ప్రత్యేక పల్లకీలో వేంచేపు చేసి తిరుమాడ వీధుల గుండా ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా  భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి.  ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ బ్రహ్మోత్సవ చక్రస్నాన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది.

అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారితో పాటు సుదర్శన చక్రత్తాళ్వార్‌కు అర్చకులు వేదమంత్రాల మధ్య వైభవంగా స్నపన తిరుమంజనం జరిపించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం వంటి  సుగంధ ద్రవ్యాలు,  పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ అభిషేక తంతు పూర్తికాగానే, కనుల పండువగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను శ్రీవారి పుష్కరిణిలోకి ప్రవేశపెట్టి చక్రస్నానం   పూర్తిచేశారు. 

ఈ మహా వేడుకను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం  పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ము  పుష్కరిణి ప్రాంతంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, భద్రతా సిబ్బందిని భారీగా మోహరించారు.

కంట్రోల్ రూమ్‌ల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.  తొమ్మిది రోజుల పాటు రోజుకో ప్రత్యేక వాహనంపై శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.  పెద్దశేష వాహనం నుంచి చివరిగా అశ్వ వాహనం వరకు ప్రతి వాహన సేవ నిష్ఠగా జరిగింది. 

[Tirumala Srivari Brahmotsavams, Salakatla Brahmotsavam, Chakrasnanam, TTD, Tirumala Templs, Salakatla Brahmotsavams Conclusion, Telugu One]