TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ: శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు.!

Published on: Tue Sep 29, 2026 11:46AM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్నతిరుమల పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం (సెప్టెంబర్ 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.

  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శన భాగ్యం కలగడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానినిక ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతోంది. ఇలా ఉండగా సోమవారం (సెప్టెంబర్ 28) శ్రీవారిని మొత్తం 84 వేల171 మంది  దర్శించుకుకున్నారు.  వారిలో 36 వేల 671 మంది  తలనీలాలు సమర్పించుకున్నారు.   శ్రీవారి హుండీ కానుకల  ఆదాయం   4 కోట్ల 26  లక్షల రూపాయలు వచ్చింది. 

 ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా తిరమల తిరుపతి దేవస్థానం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గంటల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అన్న, జల ప్రసాదాలను అందిస్తున్నది.  ఇక భక్తుల రద్దీకి తగ్గట్టుగానే శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రాయాలు కూడా భారీగా పెరిగాయి.  సోమవారం (సెప్టెంబర్ 28)   4.16 లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయి. ఇక శ్రీవారి అన్నప్రసాదాన్ని  2.61 లక్షల మంది స్వీకరించారు. 


[Tirumala Rush,  Pilgrim Rush, Silathoranam Queue line, TTD Hundi Income, Tirumala Darshan Waiting Time,  Laddu Prasadam Sales]