TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భక్త జనసంద్రం తిరుమల: సాధారణ రోజుల్లోనూ తగ్గని రద్దీ.!

Published on: Mon Sep 28, 2026 10:25AM

తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ  కొనసాగుతోంది. సాధారణంగా పర్వదినాలు, వారాంతాలలో ఉండే రద్దీని మించి ఇటీవల సాధారణ దినాలలో కూడా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం (సెప్టెంబర్ 28) కూడా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. కూడా కొనసాగుతోంది. లాంగ్ వీకెండ్  వీకెండ్  ముగిసిన తరువాత కూడా భక్తుల రద్దీ ఇసుమంతైనా తగ్గ లేదు. సోమవారం (సెప్టెంబర్ 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ పూర్తిగా నిండిక్యూ లైన్లు   శిలాతోరణం వరకు విస్తరించాయి. 

వారాంతం కాకపోయినా, పర్వదినాలేవీ లేకపోయినా,  భక్తుల రద్దీ ఈ స్థాయిలో కొనసాగడం విశేషం. . ముందుగానే దర్శన టికెట్లు బుక్ చేసుకున్నవారితో పాటు,  సెలవు పెట్టి మరీ కొండకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్న వారు   అధికంగా ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు,  తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలిరావడంతో తిరుమల గిరులు భక్త జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. 

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది.  18 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగడానికి ఐదు గంటలకుపైగా సమయం పడుతోంది. గంటల తరబడి క్యూలో వేచి ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ నిరంతరాయంగా అన్న, జల ప్రసాదాలను అందిస్తోంది. 

కాగా ఆదివారం ( సెప్టెంబర్ 27)  ఒక్కరోజే తిరుమల శ్రీవారిని మొత్తం 83 వేల 578 మంది భక్తులు దర్శించుకున్నారు.  వీరిలో 31 వేల137 మంది  తలనీలాలను స్వామి సమర్పించుకున్నారు.   శ్రీవారి హుండీ ఆదాయం  5 కోట్ల 07 లక్షల రూపాయలు వచ్చింది.. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే శ్రీవారి లడ్డూ విక్రయాలు కూడా భారీగా జరిగాయి.  


[Tirumala Rush, Tirumala Srivari Darshan Time,Ttirumala Hundi Income, Telugu One]