TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు: ఏపీ వెలువల విచారణకు సుప్రీం నో.!

Published on: Thu Nov 5, 2026 12:05PM

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి బదలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసు  విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలకు బదిలీ చేయాలంటూ  ప్రైవేటు డెయిరీ   మేనేజింగ్ డైరెక్టర్ మశ్చీంద్ర శాంతారామ్  సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విచారణను వేరే ప్రాంతానికి మార్చాలని ఆయనా పిటిషన్ లో కోరారు.

 తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తు,  విచారణను ఆంధ్రప్రదేశ్ పరిధి నుంచి ఇతర రాష్ట్రాలకు మార్చాలన్న ఆ పిటిషన్ ను  విచారణ చేపట్టిన  సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ కేసు  విచారణను ఏపీ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం కుండబద్దలు కొడుతూ, .  పిటిషన్‌ను కొట్టివేసింది. లడ్డూ ప్రసాదం నాణ్యత,  పవిత్రతకు సంబంధించిన ఈ అంశంపై ఇప్పటికే పలు కోణాల్లో విచారణ జరుగుతున్న తరుణంలో సుప్రీం కోర్టు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.  


[Tirumala Laddu Prasadam Ghee Adulteration Case, Supreme, Dismiss, Petition, Seeking, hearing, Outside AP, CJI Bench, Telugu One]