భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు.!
Published on: Sat Sep 26, 2026 11:48AM
.webp)
కలియుగ వైకుంఠంతిరుమల భక్త జనసంద్రంగా మారింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత కూడా భక్తుల రద్దీ ఇసుమంతైనా తగ్గలేదు. దీంతో తిరుమల భక్త జనసందోహంతో కిటకిటలాడుతోంది. శనివారం (సెప్టెంబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ పూర్తిగా నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శన భాగ్యం కలగడానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. ఇక పోతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది.
.webp)
ఈ నేపథ్యంలో క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్న, జల ప్రసాదాలను అందిస్తున్నది. ఇదిలా ఉండగా, శుక్రవారం (సెప్టెంబర్ 25) శ్రీవారిని మొత్తం 66 వేల 14 మంది దర్శించుకున్నారు. వారిలో 31 వేల 92 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 44 లక్షల రూపాయలు వచ్చింది. వారాంతం కావడంతో శని, ఆది వారాలు (సెప్టెంర్ 26, 27) భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
[Tirumala Devotees Rush, TTD Updates, Srivari Sarvadarshan, Vaikuntam Queue Complex, Tirupati Balaji, Telugu One]


