TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో అనూహ్య రద్దీ.. 24 గంటలు వేచి ఉండాల్సిందే!..

Published on: Thu Sep 10, 2026 8:46PM

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..! 

ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..!

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారిని దర్శించుకునేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోంది.

ఇక ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వరుస సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 13వ తేదీ ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో 12వ తేదీ శనివారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

ఆదివారం రద్దు చేసిన వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది.

తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయానికి భక్తులు, వీఐపీ భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

 

 

 

[ Tirumala, Tirupati, TTD, Tirumala Rush, Devotees Rush, Srivari Darshan, VIP Break Darshan, VIP Darshan Cancelled, 24 Hours Darshan, Tirumala News, TTD News, Tirupati News, Devotees, TTD Officials, Weekend Rush, Temple News ]