TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడిన మ్యాచ్ లు 68: పట్టిన క్యాచ్ లు 50.. తిలక్ వర్మ రికార్డ్.!

Published on: Mon Oct 12, 2026 3:19PM

టీమ్ ఇండియాలో కీలక బ్యాటర్ గానే కాకుండా, అద్భుత ఫీల్డర్ గా కూడా తిలక్ వర్మ ప్రత్యేక గుర్తింపు పొందాడు. బ్యాటర్ గా జట్టకు కీలక సమయాల్లో పరుగుల వరద పారిస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న తిలక్ వర్మ ఫీల్డర్ గా కూడా తన ప్రతిభను చాటుతున్నాడు.  తిలక్ వర్మ టి 20 ఇంటర్నేషనల్స్ లో ఇటు బ్యాటర్ గా, అటు ఫీల్డర్ గా జట్టను కీలక సమయాల్లో ఆదుకుంటున్నాడు.

ఈ హైదరాబాదీ క్రికటర్ తాజాగా 50 క్యాచ్ ల క్లబ్ లో చేరాడు. టి20ల్లో 50 క్యాచ్ లు అందుకున్న ఐదో క్రికెటర్ గా నిలిచాడు.  అంతేకాదు, అతి తక్కువ మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన ఇండియన్ గా మొదటి స్థానంలో నిలిచాడే. విండీస్ తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 11) ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ ఈ ఘనత సాధించాడు. 

ఇప్పటి వరకూ 50 టి20లు ఆడిన తిలక్ వర్మ.. 50 క్యాచ్ లు అందుకున్నాడు.  కనీసం 50 క్యాచ్‌లు పట్టిన భారత ఫీల్డర్లలో ప్రతి ఇన్నింగ్స్‌కు సగటున 0.757 క్యాచ్‌ల నిష్పత్తితో అతడు అగ్రస్థానంలో నిలిచాడు. ప్రపంచ స్థాయిలో ఈ ప్రత్యేక నిష్పత్తిలో తిలక్ కంటే ముందున్న ఆటగాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన మహమ్మద్ వసీమ్. అతడు 99 మ్యాచ్‌ల్లో 76 క్యాచ్‌లు అందుకుని ప్రతి ఇన్నింగ్స్‌కు 0.767 క్యాచ్‌ల నిష్పత్తితో ముందున్నాడు. అంటే ప్రపంచ క్రికెట్‌లోనూ తిలక్ వర్మ అత్యుత్తమ ఫీల్డర్ల లో ఒకడిగా గుర్తింపు పొందాడన్న మాట. 

ఇక టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల జాబితాలో తిలక్ వర్మది ఐదో స్థానం.. ఈ జాబితాలో 65 క్యాచ్ లతో రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతడి తరువాతి స్థానాల్లో వరుసగా 64 క్యాచ్ లతో హార్ధిక్ పాండ్యా,  58 క్యాచ్ లతో సూర్యకుమార్ యాదవ్, 54 క్యాచ్ ల విరాట్ కోహ్లీ ఉన్నారు. 

[Tilak Varma Reaches 50 Catches Club, Tilak Varma  record, T20 International Cricket, Tilak Varma 50 Catches, Rohit Sharma, Hardik Pandya, Virat Kohli, 68Matches, Telugu One]