TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముఖేష్ అంబానీ ఇంట గణేష్ వేడుకలు.. సందడి చేసిన ట్రంప్ కుమార్తె.!

Published on: Fri Sep 18, 2026 8:32AM

 ప్రఖ్యాత వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నివాసమైన ఆంటిలియా లో  జరిగిన గణేష్ చతుర్థి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి. ఈ వేడుకల్లో భాగంగా అంబానీ కుటుంబం నిర్వహించిన గణపతి దర్శన వేడుకకు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్ హాజరయ్యారు.

 తన భర్త మైఖేల్ బౌలోస్, తల్లి మార్లా మ్యాపుల్స్‌తో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న టిఫనీ ట్రంప్, ఈ వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.   2 బిలియన్ డాలర్లు   విలువైన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటైన ఆంటిలియాలో జరిగిన ఈ వేడుకకు హాజరైన ఆమె  ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల కోసం టిఫనీ ట్రంప్   లెహంగా  ధరించి సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు. 

 లైమ్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ కస్టమ్ మేడ్ లెహంగాపై  ఎంబ్రాయిడరీ,  ముత్యాలు, సిల్వర్ జరీ  హ్యాండ్‌వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దుస్తులకు తగినట్లుగా కాంట్రాస్ట్ కోరల్-పింక్ ఆర్గంజా దుపట్టాను ధరించి, సాంప్రదాయ పోల్కీ ఆభరణాలు, ముత్యాల చోకర్ హారాలు, చెవిపోగులు, మంగ్ టీకాతో అచ్చమైన భారతీయ వధువులా టిఫనీ ట్రంప్ కనిపించారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్ తెగ వైరల్ అయ్యాయి.  

వేడుకల అనంతరం టిఫనీ ట్రంప్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా  ఇండియా, విత్ లవ్  అనే క్యాప్షన్‌తో ఈ వేడుకలకు సంబంధించిన అ  ఫోటోలను షేర్ చేశారు. గతంలో తాజ్ మహల్, అక్షర్‌ధామ్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించిన టిఫనీ, ఇప్పుడు అంబానీ ఇంట్లో గణపతి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా భారతీయ సంప్రదాయాలపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు.  


[Tiffany Trump, Ambani Ganpati celebration, Antilia Mumbai, Manish Malhotra lehenga, Ganesh Chaturthi 2026, Michael Boulos, Telugu One]