టిబెట్ లో కంపించిన భూమి.. నేపాల్ లో ప్రకంపనలు.!
Published on: Wed Sep 9, 2026 9:55AM

టిబెట్ లో బుధవారం (సెప్టెంబర్ 9) ఉదయం భూమి కంపించింది. ఈ భూకంపం ప్రభావంతో నేపాల్ లో కూడా ప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతగా నమోదైంది. భూకంప కేంద్రం భూ అంతర్భాగంలో స 5 కిలోమీటర్ల లోతులో ఉంది.
టిబెట్ లో సంభవించిన భూకంప ప్రభావం నేపాల్ పై అధికంగా చూపింది. నేపాల్ లో ప్రకంపనల కారణంగా భారీ వరదలు సంభవించే ప్రమాదం ఉందన్నహెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక వారం రోజుల వ్యవధిలోనే భూమి కంపించడంతో తో తీవ్రభయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. టిబెట్ లో గత గురువారం భూకంపం సంభవించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని,

హిమాలయ, టిబెట్ పర్వత ప్రాంతాలు సిస్మిక్ జోన్ లో ఉన్నాయి. ఇండియన్ ప్లేట్ మరియు యురేసియన్ ప్లేట్ల మధ్య జరిగే రాపిడి వల్లే ఇలాంటి విపత్తులు సంభవిస్తుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఎంత తీవ్రతతో భూమి కంపిస్తుందో అంచనా వేయడం సాధ్యం కాదు. ప్రస్తుతానికైతే నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు వ్యవహరిస్తున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి ప్రభుత్వ విభాగాలు సిద్ధంగా ఉన్నాయి.
[Tibet earthquake today, Nepal earth tremors, EMSC 5.3 magnitude, NCS India seismology, Himalayan seismic zone, USGS recent earthquake]


