TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జనం కోసం చంద్రబాబు.. చంద్రబాబు కోసం జనం.!

Published on: Sun Nov 1, 2026 8:17AM

53 రోజుల అక్రమ నిర్బంధం నుంచి విడుదలై మూడేళ్లు.!

అందరూ రేపటి గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రెండు  దశాబ్దాల ముందు గురించి ఆలోచిస్తారు. అదీ ఆయన విజన్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రోజే ప్రణాళికలు రూపొందిస్తారు. అదీ ఆయన దూరదృష్టి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులూ కూడా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను, దూరదృష్టినీ ప్రశంసిస్తారు. ప్రస్తుతిస్తారు. సరే రాజకీయ విభేదాలతో మరుగుల పడేయాలని ప్రయత్నించిన నేతలూ ఉన్నారనుకోండి. వారి ప్రయత్నాలుఎన్నడూ ఫలించలేదు సరికదా వారే మరుగుల పడే పరిస్థితికి రావడం మనం చాశాం, చూస్తున్నాం.

అటువంటి చంద్రబాబునాయుడిని వై  స్కిల్ కేసు నెపంతో అక్రమంగా నిర్బంధించింది. 53 రోజుల పాటు ఆ అక్రమ నిర్బంధం కొనసాగింది. అయితే..ఆయన పులికడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. సరిగ్గా మూడేళ్ల కిందట అక్టోబర్ 31న ఆయన రాజమహేంద్రవరం జైలు గేటు నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఆయనకు లభించిన స్వాగతం, ఆయనను చూడటం కోసం జన ఉప్పెన రోడ్లను ముంచెత్తింది. సరిగ్గా మూడేళ్ల కిందట జరిగిన ఈ సంఘటన ఒక చారిత్రక ఘట్టం.

అది ఒక సాధారణ విడుదల కాదు.. కోట్లాది మంది తెలుగువారి గుండెల్లో పేరుకుపోయిన ఆవేదనకు తెరపడిన చారిత్రాత్మక సన్నివేశం.  నిత్యం ప్రజల మధ్య ఉండే చంద్రబాబు నాయుడు 53 రోజులు నిర్బంధంలో ఉండటాన్ని తెలుగువారు జీర్ణించుకోలేకపోయారు. ఆయన ఎప్పుడు బయటకు వస్తారు? ఎలా ఉన్నారు? అనే ఆతృతతో, ఆందోళనతో  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.  జైలు గేటు ముందు కిక్కిరిసిన జనసందోహం. వారి మధ్య నుంచి ఉదయిస్తున్న సూర్యుడిలా చంద్రబాబు బయటకు నడుచుకుంటూ రావడాన్ని యావద్దేశం ఉద్వేగభరితంగా తిలకించింది. ఆ సమయంలో చంద్రబాబు మనవడు జనం మధ్య నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి తాతను చుట్టేసుకోవడం ఆ తాతా, మనవళ్ల మధ్య అనుబంధానికి చిహ్నంగా నిలిచిపోతుంది. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా, టీవీల ద్వారా పరోక్షంగా వీక్షించిన జనాల కళ్లు చెమ్మగిల్లాయి. 
దాదాపు ఐదు దశాబ్దాల తన రాజకీయ ప్రయాణంలో చంద్రబాబు  ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా  నిత్యం ప్రజలలోనే ఉన్నారు. వారితో మమేకమయ్యారు.  అలాంటి జననేతను 53 రోజులుకు పైగా అక్రమ నిర్బంధంలో ఉండటం  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆవేదనకు గురి చేసింది. వారిలో ఆగ్రహ జ్వాలను నింపింది. తమ కోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా  పనిచేసిన నాయకుడికి ఇదేనా బహుమతి? అంటూ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోయారు. 

ఇక సరిగ్గా మూడేళ్ల కిందట ఆయన విడుదల వార్త వెలువడిన క్షణం నుంచి రాజమండ్రి నుంచి కరకట్ట వరకు జనప్రవాహం ఉప్పొంగింది. గోదావరి, కృష్ణా నదుల ప్రవాహాన్ని తలపించేలా ప్రజలు రోడ్లపైకి తరలివచ్చారు. పట్టిసీమ ప్రవాహానికి పదింతల జన   ప్రవాహం  చంద్రబాబు కోసం   కదిలివచ్చింది.  ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, రాజకీయ ప్రత్యర్థులు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు  టీవీలకు అతుక్కుపోయారు. ఇన్నిరోజుల తర్వాత తమ అభిమాన నాయకుడిని ఒక్కసారి చూడాలనే తపన ప్రతి తెలుగువాడిలో కనిపించింది.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వానికి ప్రజలు అపూర్వమైన విజయాన్ని అందించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి 175 స్థానాలకు గాను 164 స్థానాలను కైవసం చేసుకోవడం ప్రజాభిమానానికి రాజకీయ రూపంగా నిలిచింది. చంద్రబాబు అరెస్టుతో జగన్ సర్కార్ వంద తప్పులూ చేసేసిందని భావించిన ప్రజ శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో శిశుపాలుడి శరస్సు ఖండించిన చంద్రంగా తమ ఓటు ద్వారా జగన్ సర్కార్ ను గద్దె దించారు.   చంద్రబాబు విడుదల కేవలం ఒక నాయకుడు జైలు నుంచి బయటకు రావడం మాత్రమే కాదు.. ప్రజాభిమానం, రాజకీయ విశ్వాసం, నాయకత్వంపై నమ్మకాన్ని  చాటిచెప్పిన చారిత్రాత్మక సందర్భం. ఆ రోజు జ్ఞాపకాలు ఇప్పటికీ, ఎప్పటికీ  తెలుగువారి మనసుల్లో సజీవంగానే ఉన్నాయి. ఉంటాయి.  

[Three Years, Cbn, Illegal Detention, Release, Telugu One]