TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ముగ్గురు మృతి..!

Published on: Fri Sep 11, 2026 10:47AM

తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వెల్లూరు జిల్లా కాట్పాడి సమీపంలోని మందికృష్ణాపురంలో నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. మరో 8 మంది గాయపడ్డారు. చర్చి పైకప్పు కోసం కాంక్రీట్ పనులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. సుమారు 20 అడుగుల ఎత్తులో ఉన్న స్టీల్ స్కాఫోల్డింగ్, సపోర్ట్ ఫ్రేమ్‌వర్క్ ఒక్కసారిగా కూలిపోవడంతో భారీ కాంక్రీట్ శిథిలాలు కార్మికులపై పడినట్లు పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జిల్లా అధికా రులు రంగంలోకి దిగారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అరక్కోణం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంది. గాయపడిన 8 మంది కార్మికులను వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి, క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రితో పాటు చిత్తూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

కనీసం కొంతమంది మంది పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వెల్లూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు, భవన నిర్మాణ నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలను కూడా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనతో మందికృష్ణాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్మాణ సమయంలో సపోర్ట్ వ్యవస్థ విఫలమవ్వడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ.. పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు తర్వాతే వెల్లడికానున్నాయి.

 

 

 

[ Three killed in church collapse, Vellore District, Cotpaadi, Christian Medical College, Tamil Nadu, Andhra Pradesh border, Telugu One, Telugu News ]