TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టిమ్స్ ఎర్రగడ్డ ఆసుపత్రిలో చోరీ..!

Published on: Sun Sep 20, 2026 12:14PM

హైదరాబాద్ ఎర్రగడ్డలోని టిమ్స్ ఆసుపత్రిలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆసుపత్రిలోని ఓ ప్రాంతా నికి సంబంధించిన తాళాన్ని పగులగొట్టిన గుర్తుతెలియని అగంతకులు లోపలికి ప్రవేశించి సామాగ్రిని అపహరించినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే బోరబండ పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎప్పుడు ఆసుపత్రిలోకి ప్రవేశించారు, ఎంతమంది ఉన్నారు, ఏయే వస్తువులు అపహరణకు గురయ్యాయి, వాటి విలువ ఎంత అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో గతంలోనూ వివిధ ఘటనలకు సంబంధించి బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు నమోదైన సందర్భాలు ఉన్నాయి. తాజాగా టిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న చోరీపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన సామాగ్రి వివరాలు, నిందితుల గుర్తింపు, అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

 

 

[ Theft at TIMS Erragadda Hospital, Borabanda Police, Minister damodara raja narasimha, CM Revanth reddy, CP Sajjnar, DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]