హైదరాబాద్ లో టీజీ సేఫ్ స్పెషల్ డ్రైవ్.. కేఫ్ లు, హోటళ్లలో నిబంధనల ఉల్లంఘనపై ఉక్కుపాదం.!
Published on: Thu Sep 3, 2026 2:21PM

తెలంగాణలో ప్రజల ఆరోగ్యామే లక్ష్యంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. హైదరాబాద్‌లోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న కేఫ్‌లు, స్నాక్ పాయింట్లపై తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ డ్రగ్స్’ (టీజీ సేఫ్) విభాగం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భాగంగా మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల తనిఖీలు చేపట్టాయి.
నగరంలోని పలు ప్రముఖ కేఫ్‌లు, హోటళ్లలో నిర్వహించిన ఈ తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు వెలుగు చూశాయి. ముఖ్యంగా కొన్ని కేఫ్‌లలో గడువు తీరిన ( ఆహార పదార్థాలు, కుళ్ళిన వస్తువులు దర్శనమిచ్చాయి. వంటశాలల్లో పరిశుభ్రత పాటించకపోవడం, ఎంట్రీ పాయింట్ల వద్ద చెత్తాచెదారం పేరుకుపోవడం, కనీసం ఓపెన్ డస్ట్‌బిన్‌లను కూడా మూసివేయకుండా నిర్లక్ష్యంగా వదిలేయడాన్ని అధికారులు గుర్తించారు. ఆహారాన్ని వడ్డించే సిబ్బంది తలటోపీలు లేదా గ్లౌజులు ధరించకపోవడాన్నీ, వంటగదిలో బొద్దింకలు, ఈగలు ముసరడాన్ని గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరుపై టీజీ సేఫ్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
.webp)
సరైన లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేకుండా దర్జాగా వ్యాపారం సాగిస్తున్న బాగ్ లింగం పల్లిలోని డ్రీమ్స్ కేఫ్, పంజాగుట్టలోని ఆసియాటిక్ కేఫ్‌ను సీజ్ చేశారు. మరోవైపు, మదీనా బిల్డింగ్‌లోని ప్రసిద్ధ షాదాబ్ హోటల్ లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించడం, మాంసం నిల్వ చేసే పద్ధతులు అధ్వాన్నంగా ఉండటంతో... ఆ హోటల్ లైసెన్స్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయించారు. అలాగే కేఫ్ పెర్సియా, బెహర్ బిర్యానీ కేఫ్, కేఫ్ డెక్కన్, హనీమూన్ కేఫ్, నిమ్రా కేఫ్ అండ్ బేకరీ వంటి వాటికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించని గోల్డెన్ కేఫ్, మిరోసా కేఫ్ వంటి వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
[TG SAFE raids, Hyderabad cafes inspection, FSSAI licence suspended Shadab, food safety violations Hyderabad, 19 cafes inspected, Telangana food safety]


