TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో ఆహార సంస్థలపై TG SAFE ప్రత్యేక తనిఖీలు..!

Published on: Thu Sep 10, 2026 7:42PM

 

23 సంస్థలకు నోటీసులు, మూడు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..!

 తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కోర్ అర్బన్ రీజియన్ వెలుపల ఉన్న వివిధ జిల్లాల్లో ఆహార సంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రెస్టా రెంట్లు, బేకరీలు, ఢాబాలు, హోటళ్లు, స్వీట్ షాపులు, హాస్టళ్లు తదితర ఆహార సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ అధి కారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 46 ఆహార సంస్థలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కొన్ని సంస్థల్లో అధికారులు పలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. పాడైపోయిన, కలుషితమైన మాంసం, కూరగాయలను వినియో గిస్తున్నట్లు గుర్తించి వాటిని అక్కడికక్కడే పారవేశారు. కొన్ని సంస్థల్లో బొద్దింకలు, ఈగలు, ఎలుకల బెడద ఉన్నట్లు గుర్తించారు. అపరిశుభ్రమైన పరిసరా లతో పాటు రికార్డుల నిర్వహణ లోనూ నిబంధ నల ఉల్లంఘనలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కొన్ని సంస్థల్లో రిఫ్రిజిరేటర్ల ను అపరిశుభ్రంగా నిర్వ హించడంతో పాటు శాకాహార, మాంసాహార ఆహార పదార్థాలను సరైన విధంగా వేరు చేయకపో వడం, ఆహార పదార్థాలకు లేబులింగ్ చేయకపోవడం గుర్తించారు. అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలు, పురుగుల బారిన పడిన ఆహార పదార్థాలు ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఆహార పదార్థాల్లో కల్తీపై అనుమానంతో అధికారులు మొత్తం 22 ఆహార నమూనాలను సేకరిం చారు. పాడైపోయిన కూరగాయలు, పురుగుల బారిన పడిన ఇతర ఆహార పదార్థాలను తనిఖీల సమయంలోనే అక్కడికక్కడే పారవేశారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవా లని 23 ఆహార సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేయనున్నారు. 

ఆహార భద్రతా నిబంధనలను పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిం చేందుకు ఆయా సంస్థల ను మరోసారి తనిఖీ చేయనున్నారు. రీ-ఇన్‌స్పెక్షన్ అనంతరం నిబంధనల అమలు స్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకో నున్నారు. ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మూడు సంస్థలకు సంబంధించిన FSSAI లైసెన్సులను సస్పెండ్ చేయడంతో పాటు వెంటనే వ్యాపార కార్యకలాపాలను నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. 

ఇందులో స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఎం/ఎస్ మహేంద్ర మీల్స్, బిర్యానీ అండ్ కర్రీ పాయింట్, కరీంనగర్ బావ్‌పేట్‌లోని శ్రీ బాలాజీ మ్యాజిక్ మిఠాయి, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, తూప్రాన్‌పేట్‌ లోని NH-65పై ఉన్న ఎం/ఎస్ చా చా ఫ్యామిలీ ఢాబా ఉన్నాయి. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించాలని TG SAFE కమిషనర్ కార్యాలయం కోరింది. తనిఖీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా అవసరమైన చర్యల కోసం పంపించి నట్లు అధికారులు తెలిపారు

 

 

[ TG SAFE, FSSAI Licenses,  Food Safety Officers, CM Revanth reddy,Telangana goverment, Minister Jupally Krishna Rao, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News ]