TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాతికేళ్లకే గుండెపోటు: అమెరికాలో తెలుగు యువతి మృతి.!

Published on: Sat Oct 24, 2026 10:46AM

ఓ తెలుగు యువతి అమెరికాలో హఠాన్మరణం చెందారు. పాతికేళ్ల అక్షిత ఉన్నత చదువుల కోసం నాలుగేళ్ల కిందట అమెరికా వెళ్లారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నారు. న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం (అక్టోబర్ 22) రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.

 అమెరికాలో ఆమెతో పాటే నివసిస్తున్న అక్షిత సోదరుడు  అక్షయ్   ఆమెను   స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు  నిర్ధారించారు.  
అక్షిత మరణ వార్తతో ఖమ్మంలోని అమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.   అక్షిత భౌతిక కాయాన్ని అమెరికా నుంచి స్వస్థలానికి రప్పించేందుకు కుటుంబ సభ్యులు,   ఏర్పాట్లు చేస్తున్నారు.  

[Telugu Woman Dies in USA, Nallamalla Akshitha, 25years, HeartAttack,  Khammam, New York, TeluguOne]