TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తన పాలనకు రేవంత్ సెల్ఫ్ రేటింగ్: నూటికి 65 మార్కులే.!

Published on: Sat Nov 21, 2026 10:49AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనకు తానే   రేటింగ్ ఇచ్చుకుని  సంచలనానికి తెరలేపారు ఒక జాతీయ మీడియా సదస్సులో  ఆయన తన పాలనకు  65 శాతం మార్కులు ఇవ్వొచ్చని ప్రకటించారు.   ఇంకా చేయాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని, రాబోయే రెండేళ్లలో వాటిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు రేవంత్ చెప్పారు.  సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు. అలా అతి విశ్వాసంతో తమ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ గొప్పలు చెప్పుకున్న చాలా మంది ముఖ్యమంత్రులకు ఎన్నికలలో ప్రజలు తన ఓటు ద్వారా వాస్తవ పరిస్థితిని తెలియజెప్పిన సంఘటనలు దేశంలో చాలా ఉన్నాయి. 

అయితే..  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలకు తాను ఏమి చేశాను? ఇంకా చేయాల్సింది ఏమిటి? ఎంత వరకూ చేయగలను? అన్న అంశాలపై స్పష్టత ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే ఇప్పటి వరకూ తన పాలన ఎలా ఉందో అన్న విషయంలో ఆయన చాలా చాలా వాస్తవంగా, నిజాయితీగా చెప్పారు.  

 జాతీయ మీడియా సదస్సులో, ఇప్పటివరకు మీ  పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారన్న ప్రశ్న ఎదురైనప్పుడు రేవంత్ రెడ్డి ఏ మాత్రం తడుముకోకుండా, తడబడకుండా నూటికి 65 మార్కులు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు తానే తక్కువ మార్కులు ఇచ్చుకోవడం ద్వారా వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తానని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లైంది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉందనీ, చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయనీ చెప్పిన రేవంత్ వాటిని కచ్చితంగా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

సాధారణంగా ముఖ్యమంత్రులు తాము చేయగలిగినదంతా చేశామని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెబుతూ, తమకు తామే వంద శాతం రేటింగ్ ఇచ్చుకుంటూ స్వోత్కర్షకు ప్రాధాన్యత ఇస్తుంటారు.  రేవంత్ రెడ్డి మాత్రం తాను చేయాల్సినది ఇంకా ఉందనీ, మూడేళ్ల పాలనా కాలంలో కేవలం 65శాతం మాత్రమే తాను అనుకున్నది చేయగలిగాననీ నిస్సంకోచంగా అంగీకరించి పరిశీలకులను సైతం విస్మయపరిచారు. 

ఇది కూడా చదవండి:   బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.!

తాను ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని చెప్పడం, ప్రజాభిప్రాయం ప్రకారం కూడా తనకు నూటికి 64 మార్కులే పడ్డాయని ధైర్యంగా చెప్పగలగడం  ద్వారా తాను వాస్తవాలను వాస్తవాలుగా అంగీకరించడానికి భయపడనని చాటినట్లైంది. 

అదే సమయంలో మిగిలిన రెండేళ్ల పాలనా కాలంలో ప్రజల అంచనాలను చేరుకుని మిగిలిన 35 మార్కులూ కూడా సాధిస్తానని అంతే ధైర్మంగా చెప్పడం ద్వారా.. తాను వందశాతం ప్రజామోదాన్ని పొందడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పినట్లైంది. మొత్తం మీద తనకు తాను రేటింగ్ ఇచ్చుకుని రేవంత్ రెడ్డి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారని రాజకీయవర్గాలలో  చర్చ జరుగుతోంది.

మీకు నచ్చవచ్చు:  మహిళా శక్తే నా శక్తి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి

డీ లిమిటేషన్ దక్షిణాదికి గొడ్డలి పెట్టు: అమిత్ షా దమ్ముంటే ఒవైసీపై పోటీకి దిగు.!


 [TelanganaCM, Revanth Reddy, Selfrating, Governence,  TeluguOne]