తెలంగాణలో ‘కౌరవ సభ’.. అసెంబ్లీలో రగడకు అసలు కారణమేంటి..?
Published on: Sat Sep 12, 2026 3:31PM

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న దూకుడు.. అసెంబ్లీ వేదికగా సాగుతున్న మాటల యుద్ధంపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ జరిగింది. రాజకీయ విమర్శలు క్రమంగా వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మధ్య కొనసాగుతున్న రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలు చర్చకు వచ్చాయి. అదే సమయంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
గతంలో అసెంబ్లీ చర్చలు ఎలా ఉండేవి.. ప్రస్తుతం పరిస్థితులు ఎలా మారిపోయాయన్న అంశంపైనా విశ్లేషణ జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జైపాల్‌రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతల హయాంలో శాసనసభ చర్చలు ప్రధానంగా విధానాలు, ప్రజా సమస్యలు, అంశాల ఆధారంగా సాగేవని గుర్తుచేశారు. భాషలో సంస్కారం, చర్చల్లో హుందాతనం కనిపించేవని పేర్కొన్నారు.
.webp)
అయితే ప్రస్తుతం రాజకీయ నేతల మధ్య వ్యక్తిగత విమర్శలు, పరస్పర దూషణలు పెరిగిపోతున్నాయని విశ్లేషించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభలోనే రాజకీయ రగడకు ప్రాధాన్యత పెరగడం ఆందోళన కలిగించే పరిణామమన్న అభిప్రాయం వ్యక్తమైంది.
అంతేకాదు.. అసెంబ్లీ వేదికగా చర్చించాల్సిన అంశాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు వీధుల్లోకి వచ్చి పోరాటాలకు సిద్ధమవడం కూడా చర్చకు వచ్చింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమే అయినా.. వాటిని శాసనసభలోనే చర్చించి పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న భాష, పెరుగుతున్న అగ్రెసివ్ పాలిటిక్స్.. అసెంబ్లీ చర్చల తీరుపై ఆసక్తికరమైన విశ్లేషణ జరిగింది.
[ Telangana Politics, Telangana Assembly, KCR, Revanth Reddy, Telangana Assembly Ruckus, KCR vs Revanth Reddy, Telangana Political Crisis, Assembly Debate, Telangana Political War, Telangana Politics ]


