హోటళ్ల లైసెన్సులు రద్దు: ఒక ఫార్సేనా.. ఫుడ్ సేప్టీ అధికారులది ఉత్తుత్తి హడావుడేనా.?
Published on: Sat Oct 3, 2026 10:38AM

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాల్సిన హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, నాణ్యత కొరవడుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో అన్నీ అని కాదు కానీ పలు హోటళ్లు, రెస్టారెంట్లు నిబంధనలకు నీళ్లొదిలి, కనీస నాణ్యతా ప్రమాణాలు కూడా పాటించకుండా, పరిశుభ్రత, నాణ్యత గురించి పట్టించుకోకుండా నడుపుతున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవలి కాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలను బేఖాతరు చేసి మరీ నడుపుతున్న పలు హోటళ్లు రెస్టారెంట్లను సీజ్ చేసి, వాటి లైసెన్సులను రద్దు చేశారు.
.webp)
టీజీ సేఫ్ దాడులు, సీజ్ లను రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ప్రియులు స్వాగతించారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లలో ధైర్యంగా తినవచ్చని భావించారు. తమ ఆరోగ్యానికి ఢోకా ఉండదని అనుకున్నారు. అయితే వాస్తవంగా ఆ పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు లైసెన్సులు రద్దు చేసినా కొన్ని హోటళ్లు నేరుగా వినియోగదారులకు కనిపించకుండా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వేదికల ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి.
.webp)
. లైసెన్సు రద్దయిన సంస్థలు ఆహార తయారీ, విక్రయ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించేందుకు అధికారులు తనిఖీలను మరింత సమర్థంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఆన్‌లైన్ డెలివరీ సంస్థలు కూడా చెల్లుబాటయ్యే ఆహార భద్రతా లైసెన్సులను ధ్రువీకరించే వ్యవస్థను పటిష్ఠం చేయాలని అంటున్నారు.
.webp)
ప్రజారోగ్యానికి సంబంధించిన వ్యవహారం కనుక కేవలం దాడులు, సీజ్ లు లైసెన్సుల రద్దతో చేతులు దులిపేసుకోవడమే కాకుండా, లైసెన్స రద్దైన తరువాత కూడా ఆన్ లైన్ ద్వారా సరఫరాలు కొనసాగిస్తున్న వారిపై కొరడా ఝుళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
[Telangana Food Safety, Cancellation Hotel Licenses, Telangana Hotels Restaurants, Food Safety Officials, TG SAFE, Farce, Telugu One]


