రెండో టీ20లోనూ టీమ్ ఇండియా జయభేరి: కివీస్ పై 4 వికెట్ల తేడాతో గెలుపు.!
Published on: Sat Oct 24, 2026 5:17PM

న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ లో భాగంగా శనివారం (అక్టోబర్ 24) జరిగిన రెండో మ్యాచ్ లో టీమ్ ఇండియా నాలుగు వికెట్ల ఆధిక్యతతో విజయం సాధించి సిరీస్ లో 2-0తో ముందంజలో ఉంది. అయితే రెండో టి20లో టీమ్ ఇండియా విజయం కోసం చెమటోడ్చింది. మ్యాచ్ ఆద్యంతం విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. తొలుత బ్యాటొంగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కివీస్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 40 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా ఓపెనర్ ఫిన్ అలెన్ 24 బంతుల్లో 45 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. డారిల్ మిచెల్ కూడా 28 పరుగులు చేసి తన వంతు సహకారం అందించాడు. చివర్లో బెవాన్ జాకబ్స్ వేగం ఆడుతూ, 16 బంతుల్లో 3 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత తడబడ్డారు. ఓ దశలో 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి తమ అద్భుత బ్యాటింగ్ తో ఆదుకున్నారు.
.webp)
ఇద్దరూ కలిసి 30 బంతుల్లోనే 69 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. తిలక్ వర్మ తన ఇన్నింగ్స్‌లో 26 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 51 పరుగులు చేశారు. మరోవైపు నితీశ్ కుమార్ రెడ్డి కేవలం 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇద్దరి దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది.
[Team India win Seconr T20, Tilakverma, Nitesh Kumar Reddy, Team India victory, Telugu One]


