టీమిండియాకు బౌలింగ్ కష్టాలు.. విండీస్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన!
Published on: Fri Oct 16, 2026 10:20AM

సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలకమైన టి20 సిరీస్‌లో టీమిండియా పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ మరియు ఫీల్డింగ్ వైఫల్యాలు భారత జట్టు వరుస ఓటములకు ప్రధాన కారణంగా మారుతున్నాయి. రాంచితో పాటు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచుల్లోనూ బౌలింగ్ లోపాలు జట్టును తీవ్రంగా వెంటాడాయి. రాంచిలో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 250 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోవడంలో మన బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
అలాగే ఉప్పల్‌లో జరిగిన నాల్గో టి20 మ్యాచ్‌లోనూ బౌలర్లు కంట్రోల్ కోల్పోయి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ రెండు కీలక మ్యాచులలోనూ టీమిండియాకు ఘోర పరాజయాలు తప్పలేదు. అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్, నమన్ ధిర్, నితీశ్ కుమార్ రెడ్డి తదితరులందరూ ఈ సిరీస్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చి ఒత్తిడికి లోనయ్యారు. కొంతకాలంగా టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న ఈ బౌలింగ్ సమస్యకు తక్షణ పరిష్కారం దొరకడం లేదు.
(9).webp)
బుమ్రా, సిరాజ్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు మినహా మిగిలిన ప్రధాన పేసర్లు అంతా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్నారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ ఒక్కడే కొంతవరకు పర్వాలేదనిపిస్తున్నప్పటికీ, అతన్ని కీలకమైన మ్యాచులలో అనూహ్యంగా జట్టుకు దూరంగా ఉంచుతున్నారు. రవి బిష్ణోయ్ లాంటి ప్రతిభావంతులైన బౌలర్లు కూడా బెంచ్‌కే పరిమితం కావలసి వస్తోంది. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఆటగాళ్ల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని, దీని ప్రభావం నేరుగా వారి ప్రదర్శనపై స్పష్టంగా కనిపిస్తోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత టీమిండియా బౌలింగ్ లైనప్ చాలా బలహీనంగా తయారైంది. రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో ఈ బలహీన బౌలింగ్‌తో విజయాలు సాధించడం అత్యంత కష్టంతో కూడుకున్న అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఫీల్డింగ్ రంగంలోనూ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చేతికొచ్చిన సులువైన క్యాచ్‌లను సైతం నేలపాలు చేస్తూ ప్రత్యర్థి జట్లకు ఊపిరిూదుతున్నారు. విండీస్ సిరీస్‌లో మన ఫీల్డింగ్ ప్రమాణాలు పూర్తిగా తీసికట్టుగా మారి, ప్రత్యర్థి బ్యాటర్లకు వరంగా మారుతున్నాయి. ఇప్పటికైనా మేనేజ్మెంట్ స్పందించి బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లోపాలను సరిదిద్దుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
[India vs West Indies T20 Series, Team India Bowling Problems, Indian Cricket Team, Gautam Gambhir, Jasprit Bumrah, Mohammed Siraj, Arshdeep Singh, Kuldeep Yadav, Ravi Bishnoi, India Fielding Failures]


