TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఒంగోలు మేయర్ శ్రీశిల్ప: కార్పొరేషన్ లో తెలుగుదేశం జయభేరి. డివిజన్లలో వైసీపీ స్కోరు 11.!

Published on: Wed Nov 4, 2026 2:39PM

ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్  తెలుగుదేశం కూటమి వశమైంది. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలలో  తెలుగుదేశం  ఘన విజయం సాధించింది. ఒంగోలు మేయర్ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి నల్లమళ్ళ శ్రీశిల్ప కైవసం చేసుకున్నారు.   ఆమె తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థిపై  37 వేల ఓట్ల అఖండ మెజారిటీతో విజయం సాధించారు.  ఈ విజయంతో తెలుగుదేశం కూటమి శ్రేణులు ఒంగోలులో సంబరాలు చేసుకున్నారు.  కౌంటింగ్ లో మొదటి నుంచి నల్లమళ్ళ శ్రీశిల్ప స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు. 

అదలా ఉంటే ఒంగోలు కార్పొరేషన్ లో   తెలుగుదేశం  39 స్థానాల్లో గెలుపొందగా, మిత్రపక్షాలు  జనసేన   8 డివిజన్లలో, బీజేపీ ఒక డివిజన్‌లో విజయం సాధించాయి.  ఇక వైసీపీ కేవలం 11 డివిజన్లకే పరిమితమైంది. ఇతరులు మూడు డివిజన్ లలో గెలుపొందారు.  కాగా మురసు తుపాను కారణంగా ఒంగోలు కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. తుపాను కారణంగా మంగళవారం (నవంబర్ 3) జరగాల్సిన ఓట్ల లెక్కింపు  బుధవారం (నవంబర్ 4) నిర్వహించారు.  

[TDP Win Ongole Corporation, Mayor, SriSilpi, TDP Victory,  Ongole Municipal Corporation, AP Local Body Elections, Telugu One]